తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు - ఏర్పాట్లకు హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఆదేశాలు

Lasya Nanditha Last Rites with Official Ceremonies : ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఆదేశాలిచ్చింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 1:19 PM IST

Updated : Feb 23, 2024, 2:24 PM IST

Lasya Nanditha Last Rites with Official Ceremonies :కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ను ఆదేశించింది. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

BRS MLA Lasya Nanditha Died Car Accident :ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిలోనే తండ్రీకుమార్తె మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్పారని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

అంతకుముందు ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహాన్ని పటాన్‌చెరులోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పార్థివదేహానికి గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.లాస్య నందిత తలకి తీవ్ర గాయాలు అయ్యాయని గాంధీ వైద్యులు తెలిపారు. ఆమె దవడ ఎముక విరిగిందని, ఎడమ కాలు ఎముక, ఛాతి ఎముకలు విరిగాయని పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం భౌతికకాయాన్ని కార్ఖానాలో నివాసానికి తరలించారు.

Cantonment MLA Lasya Nanditha Passed Away :ఈరోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే పీఏ, డ్రైవర్‌ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతిచెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లాస్య నందిత మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కారు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

'లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరం' - సీఎం రేవంత్​ సహా ప్రముఖుల సంతాపం

Last Updated : Feb 23, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details