KTR letter to CM Revanth Reddy: నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటి దాకా పది మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం, ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని ఆక్షేపించారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపివేయాలన్న ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
KTR On Hand Loom Workers Problems : కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ పరిస్ధితి వచ్చింది. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపై అక్కసుతో, వాటిని ఆపివేశారు. దానివల్ల నేతన్నలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక నేతన్నలు తనువు చాలిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు టెక్స్ టైల్ శాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ప్రత్యేకంగా 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
'చరిత్ర పునరావృతం అవుతుంది' - ఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - KTR React on Leaders Leaving