ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE UPDATES: హెరిటేజ్ ఫుడ్స్ తరఫున తెలుగు రాష్ట్రాలకు రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన నారా భువనేశ్వరి - Floods in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 7:23 AM IST

Updated : Sep 3, 2024, 10:47 PM IST

FLOODS IN AP
FLOODS IN AP (ETV Bharat)

LIVE UPDATES: చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీతీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. బెజవాడ గజగజ లాడుతూనే ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపం, బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ఇప్పటికే జలావాసాలుగా మారిన నగరం, ఇంకా తేరుకోలేదు. అనేక కాలనీలు నీటిలోనే నానుతున్నాయి. జనం కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, వరద ఉద్ధృతికి చివరి ప్రాంతాలకు వెళ్లలేకపోయింది. ఫలితంగా ప్రజలు సాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 5న పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్​ లైవ్ అప్డేట్స్.

LIVE FEED

10:45 PM, 3 Sep 2024 (IST)

  • హెరిటేజ్ ఫుడ్స్ తరఫున తెలుగు రాష్ట్రాలకు రూ.2 కోట్ల ఆర్థిక సాయం
  • తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన నారా భువనేశ్వరి
  • ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.కోటి ప్రకటన

10:12 PM, 3 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజ్‌కు వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • 11.43 లక్షల నుంచి 6.75 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 16.4 అడుగుల మేర నీటిమట్టం

10:02 PM, 3 Sep 2024 (IST)

  • కోట్ల మందికి వరద హెచ్చరిక సందేశాలు పంపాం: విపత్తుల నిర్వహణ శాఖ
  • వరదల వల్ల 12 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి: విపత్తుల శాఖ
  • వర్షాల వల్ల 2,851 కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి: విపత్తుల శాఖ
  • లక్షా 80 వేల హెక్టార్ల వరి, 17,645 హెక్టార్లలోఉద్యాన పంటలకు నష్టం
  • 78 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయి: విపత్తుల శాఖ
  • హెలికాప్టర్ల ద్వారా 21 మందిని రక్షించాం: విపత్తుల నిర్వహణ శాఖ

9:57 PM, 3 Sep 2024 (IST)

  • వరద బాధితులకు సహాయచర్యల పురోగతిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
  • మంత్రి లోకేష్ పర్యవేక్షణలో ముంపుప్రాంతాల్లో వేగంగా సహాయ చర్యలు
  • వరదల వల్ల ఎన్‌టీఆర్‌ జిల్లాలో 49, ఏలూరు జిల్లాలో 23 చెరువులకు గండ్లు
  • వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు
  • వర్షాలు, వరదలకు దెబ్బతిన్న 2,851 కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్లు
  • దెబ్బతిన్న 308 కి.మీ. మున్సిపల్, 221 కి.మీ. పంచాయతీరాజ్ రోడ్లు
  • వరద ప్రాంతాల్లో 194 మెడికల్ క్యాంపుల ద్వారా ఆరోగ్య సేవలు
  • వరద బాధితుల కోసం 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మందికి ఆశ్రయం
  • వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం

8:15 PM, 3 Sep 2024 (IST)

  • విజయవాడ: వరద బాధితులకు విరాళాలు ఇచ్చేవారి కోసం ఏర్పాట్లు
  • విరాళాల కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు
  • విరాళాలు ఇచ్చేవారు 79067 96105లో సంప్రదించవచ్చన్న ప్రభుత్వం
  • సీఎం సహాయనిధికి ఆన్‌లైన్‌లోనూ విరాళాలు పంపవచ్చన్న ప్రభుత్వం
  • వెలగపూడి ఎస్‌బీఐ ఖాతా 38588079208కు విరాళాలు పంపవచ్చన్న ప్రభుత్వం
  • వెలగపూడి యూబీఐ ఖాతా 110310100029039కు విరాళాలు పంపవచ్చన్న ప్రభుత్వం

8:12 PM, 3 Sep 2024 (IST)

  • గత ప్రభుత్వ వైఖరి వల్లే వరద కష్టాలు: పవన్ కల్యాణ్‌
  • వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం: పవన్ కల్యాణ్‌
  • వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాం: పవన్ కల్యాణ్‌
  • ఇంకా సాయం కావాల్సిన వారు 112, 1070కు ఫోన్ చేయవచ్చు: పవన్
  • బాధితులకు సాయం చేసేందుకు అధికారులు త్వరగా స్పందించారు: పవన్
  • సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
  • సీఎం సహాయనిధికి నా వంతుగా రూ.కోటి విరాళం: పవన్‌ కల్యాణ్‌
  • రేపు సీఎంను కలిసి నా వ్యక్తిగత విరాళం అందజేస్తాను: పవన్‌
  • వరద ప్రాంతాల్లో నేనూ పర్యటించాలని అనుకున్నాను: పవన్
  • నా వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నా: పవన్‌
  • నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు: పవన్
  • నేను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదు: పవన్
  • విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలి: పవన్‌

6:59 PM, 3 Sep 2024 (IST)

  • వరద ప్రాంతాల్లో నాలుగున్నర గంటలుగా సీఎం చంద్రబాబు పర్యటన
  • వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో వెళ్లిన సీఎం చంద్రబాబు
  • సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీలో సీఎం పర్యటన
  • అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్‌రింగ్ రోడ్ ప్రాంతాల్లో సీఎం పర్యటన
  • అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పిన సీఎం
  • జేసీబీపై దాదాపు 22 కి.మీ. మేర ప్రయాణించిన సీఎం చంద్రబాబు
జేసీబీ ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో 22 కి.మీ. మేర సీఎం చంద్రబాబు పర్యటన (ETV Bharat)

5:13 PM, 3 Sep 2024 (IST)

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలుగా సీఎం పర్యటన
  • జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
  • ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా పరిశీలించిన సీఎం
  • కాలనీల శివారు ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం ఆరా
  • చంద్రబాబు జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న సీఎం కాన్వాయ్

5:11 PM, 3 Sep 2024 (IST)

  • వాంబే కాలనీ, అజిత్‌సింగ్‌నగర్‌లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ
  • వైఎస్‌ఆర్ కాలనీ, న్యూరాజీవ్‌నగర్‌లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

5:11 PM, 3 Sep 2024 (IST)

  • వరద బాధితుల కోసం మంత్రి లోకేష్‌కు విరాళాలు ఇచ్చిన దాతలు
  • రూ.20 లక్షలు విరాళం ఇచ్చిన మంగళగిరికి చెందిన రాజశేఖర్‌రెడ్డి, కొమ్మారెడ్డి
  • వరద బాధితులకు రూ.7 లక్షలు విరాళం ఇచ్చిన మంగళగిరి వాసి రమణారెడ్డి

5:05 PM, 3 Sep 2024 (IST)

మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

  • సీఎం సహాయ నిధికి విరాళం అందించిన జూ.ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు: మంత్రి లోకేష్‌
  • సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన తెలుగు సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు: మంత్రి లోకేష్‌

5:04 PM, 3 Sep 2024 (IST)

  • బుడమేరు డ్రెయిన్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులు
  • బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 500 క్యూసెక్కులు

5:04 PM, 3 Sep 2024 (IST)

  • విజయవాడ వరద బాధితులకు మైసూర్‌ దత్తపీఠం వితరణ
  • మైసూర్‌ దత్తపీఠం తరఫున 50 వేల ఆహార పొట్లాలు పంపిణీ
  • వరద బాధితులకు సాయం చేయాలన్న శ్రీగణపతి సచ్చిదానందస్వామి
  • దత్తపీఠం భక్తులకు పిలుపునిచ్చిన శ్రీగణపతి సచ్చిదానందస్వామి

4:38 PM, 3 Sep 2024 (IST)

  • వర్షాల వల్ల విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు
  • తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు
  • కృష్ణ, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు
  • మరికొన్ని రైళ్లు తెనాలి జంక్షన్ మీదుగా దారిమళ్లింపు
  • ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్
నాగార్జున సాగర్ (ETV Bharat)

3:44 PM, 3 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజ్‌కు వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • బ్యారేజ్‌లో గంటగంటకూ తగ్గుతూ వస్తున్న వరద ప్రవాహం
  • 11.43 లక్షల నుంచి 7.9 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 18.4 అడుగుల మేర నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజ్‌లో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం
నాగార్జున సాగర్ (ETV Bharat)

3:44 PM, 3 Sep 2024 (IST)

  • వరద బాధితులకు సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ సాయం
  • తెలుగు రాష్ట్రాలకు రూ.15 లక్షల చొప్పున విరాళం ఇచ్చిన సిద్ధు
FLOODS IN AP (ETV Bharat)

3:43 PM, 3 Sep 2024 (IST)

  • విజయవాడ వరద ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటన
  • 18, 19, 20 డివిజన్లలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి
  • అధికారులతో మాట్లాడి పశువులకు గడ్డి, దాణా ఏర్పాటు చేసిన సంధ్యారాణి

3:42 PM, 3 Sep 2024 (IST)

  • విజయవాడ ముంపుప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశ్రుతి
  • వరదనీటిలో కొట్టుకుపోయి లైన్‌మెన్‌ కోటేశ్వరరావు మృతి
  • లైన్‌మెన్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి
  • లైన్‌మెన్‌ భార్య, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన మంత్రి
  • లైన్‌మెన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ
పులిచింతల ప్రాజెక్టు (ETV Bharat)

3:10 PM, 3 Sep 2024 (IST)

మంత్రి లోకేశ్ సమీక్ష

  • వరద సహాయచర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
  • వరద తగ్గినందున సహాయచర్యలు ముమ్మరం చేయాలని లోకేష్‌ విజ్ఞప్తి
  • వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచన
FLOODS IN AP (ETV Bharat)

3:04 PM, 3 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • 11.43 లక్షల నుంచి 7.98 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
ప్రకాశం బ్యారేజీ (ETV Bharat)

2:56 PM, 3 Sep 2024 (IST)

వరద బాధితులకు అవసరమైన సహకారం అందిస్తాం: ఎంపీ భరత్‌

  • విజయవాడ వరద బాధితులకు బాసటగా విశాఖ గీతం విద్యాసంస్థ
  • రోజుకు 50 వేల భోజన పొట్లాలు విజయవాడ పంపుతాం: గీతం అధ్యక్షుడు భరత్‌
  • రైలు బోగీల ద్వారా విజయవాడకు ఆహారం పంపిస్తాం: ఎంపీ భరత్‌
  • వరద బాధితులకు అవసరమైన సహకారం అందిస్తాం: ఎంపీ భరత్‌
FLOODS IN AP (ETV Bharat)

2:50 PM, 3 Sep 2024 (IST)

వరద బాధితుల సహాయార్థం ఎంపీ వేమిరెడ్డి రూ.కోటి విరాళం

  • నెల్లూరు: వరద బాధితుల సహాయార్థం ఎంపీ వేమిరెడ్డి రూ.కోటి విరాళం
  • చంద్రబాబును కలిసి విరాళం చెక్కు అందించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి

2:46 PM, 3 Sep 2024 (IST)

కుటుంబాలతో వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ సిబ్బంది

  • విజయవాడ: వరద నీటిలో విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్టాండ్లు
  • విద్యాధరపురం డిపోలో ఇప్పటికీ నీటిలోనే 40 బస్సులు
  • ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో నీటిలో మునిగిన 20 బస్సులు
  • కుటుంబాలతో వరదల్లో చిక్కుకున్న కొంతమంది ఆర్టీసీ సిబ్బంది
  • డ్రైవర్లు, కండక్టర్లు లేక పలు రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులు రద్దు
  • కొన్ని రూట్లలో బస్సుల కొరతతో దూరప్రాంతాలకు సర్వీసులు రద్దు
  • విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే 20 బస్సులు రద్దు
  • వరదలతో కళాశాలలకు సెలవుల కారణంగా సొంతూళ్లకు బయల్దేరిన విద్యార్థులు
  • బస్సులు లేక బస్టాండ్‌లోనే ఇబ్బందిపడుతున్న విద్యార్థులు, ప్రజలు

2:38 PM, 3 Sep 2024 (IST)

  • వరద సహాయచర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
  • వరద తగ్గినందున సహాయచర్యలు ముమ్మరం చేయాలని లోకేష్‌ విజ్ఞప్తి
  • వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచన

2:37 PM, 3 Sep 2024 (IST)

  • వరద బాధితులకు సీఎం సహాయనిధికి బుద్ధా వెంకన్న విరాళం
  • సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు విరాళం అందిస్తున్నా: బుద్ధా వెంకన్న

2:37 PM, 3 Sep 2024 (IST)

  • విజయవాడలో నీటమునిగిన విద్యాధరపురం, ఇబ్రహీంపట్నంలో డిపోలు
  • వరద ప్రాంతాల్లోనే ఉండిపోయిన కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు
  • బస్సులు ఉన్నా డ్రైవర్లు, కండక్టర్లు లేక నడపలేని పరిస్థితి
  • వరద తగ్గడంతో అన్ని ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు
  • డ్రైవర్లు, కండక్టర్లు లేక కొన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లలేని పరిస్థితి

2:36 PM, 3 Sep 2024 (IST)

  • వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం
  • విజయవాడ సితార సెంటర్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
  • జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలిస్తున్న చంద్రబాబు
  • ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందుతున్న తీరుపై స్వయంగా చూస్తున్న సీఎం
  • ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయన్న సీఎం
  • లోపల ఉన్న ఇళ్లకు ఆహారం అందట్లేదన్న అంశంపై సీఎం ఆరా
  • స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్న సీఎం

2:36 PM, 3 Sep 2024 (IST)

  • వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం
  • జక్కంపూడి ప్రాంతంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

2:35 PM, 3 Sep 2024 (IST)

  • మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికీ ఆహారం అందిస్తాం: నిమ్మల
  • ప్రకాశం బ్యారేజి చరిత్రలోనే ఇంత వరద రావటం ఇదే తొలిసారి: మంత్రి నిమ్మల
  • 2-3 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి: మంత్రి నిమ్మల
  • ఒక్కరోజులోనే 3 లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది: మంత్రి నిమ్మల
  • బుడమేరు గండి పడటానికి కారణం జగన్ ప్రభుత్వమే: మంత్రి నిమ్మల
  • జగన్ పాపం వల్లే బుడమేరు వరదల్లో ప్రజలు చిక్కుకున్నారు: మంత్రి నిమ్మల
  • 2019 వరకు 80 శాతం పనులు మేం పూర్తిచేశాం: మంత్రి నిమ్మల
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక 20 శాతం పనులు కూడా చేయలేదు: మంత్రి నిమ్మల
  • బుడమేరు లైనింగ్ పనులు జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది: మంత్రి నిమ్మల
  • బుడమేరుకు ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా 2018లోనే 80 శాతం పనులు చేశాం: మంత్రి నిమ్మల
  • బుడమేరు గండిపడిన చోటకు అర్ధరాత్రి అతికష్టం మీద చేరుకున్నాం: మంత్రి నిమ్మల
  • రేపు, ఎల్లుండి వరద ఇంకా చాలావరకు తగ్గిపోతుంది: మంత్రి నిమ్మల

2:25 PM, 3 Sep 2024 (IST)

విజయవాడలో నీటమునిగిన డిపోలు

  • విజయవాడలో నీటమునిగిన విద్యాధరపురం, ఇబ్రహీంపట్నంలో డిపోలు
  • వరద ప్రాంతాల్లోనే ఉండిపోయిన కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు
  • బస్సులు ఉన్నా డ్రైవర్లు, కండక్టర్లు లేక నడపలేని పరిస్థితి
  • వరద తగ్గడంతో అన్ని ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు
  • డ్రైవర్లు, కండక్టర్లు లేక కొన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లలేని పరిస్థితి

2:24 PM, 3 Sep 2024 (IST)

వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం

  • వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం
  • విజయవాడ సితార సెంటర్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
  • జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలిస్తున్న చంద్రబాబు
  • ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందుతున్న తీరుపై స్వయంగా చూస్తున్న సీఎం
  • ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయన్న సీఎం
  • లోపల ఉన్న ఇళ్లకు ఆహారం అందట్లేదన్న అంశంపై సీఎం ఆరా

1:19 PM, 3 Sep 2024 (IST)

వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం

  • వరద సహాయచర్యల పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం
  • జక్కంపూడి ప్రాంతంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

1:12 PM, 3 Sep 2024 (IST)

బుడమేరు గండి పడటానికి కారణం జగన్ ప్రభుత్వమే: మంత్రి నిమ్మల

  • బుడమేరు గండి పడటానికి కారణం జగన్ ప్రభుత్వమే: మంత్రి నిమ్మల
  • జగన్ పాపం వల్లే బుడమేరు వరదల్లో ప్రజలు చిక్కుకున్నారు: మంత్రి నిమ్మల
  • 2019 వరకు 80 శాతం పనులు మేం పూర్తిచేశాం: మంత్రి నిమ్మల
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక 20 శాతం పనులు కూడా చేయలేదు: మంత్రి నిమ్మల
  • బుడమేరు లైనింగ్ పనులు జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది: మంత్రి నిమ్మల
  • బుడమేరుకు ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా 2018లోనే 80శాతం పనులు చేశాం: మంత్రి నిమ్మల
  • బుడమేరు గండిపడిన చోటకు అర్ధరాత్రి అతికష్టం మీద చేరుకున్నాం: మంత్రి నిమ్మల
  • రేపు, ఎల్లుండి వరద ఇంకా చాలావరకు తగ్గిపోతుంది: మంత్రి నిమ్మల

1:11 PM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 18.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

  • ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • బ్యారేజ్‌లో గంటగంటకూ తగ్గుతూ వస్తున్న వరద ప్రవాహం
  • 11.43 లక్షల నుంచి 8.19 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 18.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

12:49 PM, 3 Sep 2024 (IST)

కుట్రలు జరుగుతున్నాయి: సీఎం

  • ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయి: సీఎం
  • ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్‌ చేస్తారా: సీఎం
  • ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల ఘటనపై విచారణ: సీఎం
  • ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి: సీఎం
  • బాబాయినే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా: సీఎం
  • విపక్ష నేత ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు: సీఎం
  • విపక్ష నేత ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదు: సీఎం
  • జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా?: సీఎం
  • ప్రధానితో మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా భయం లేదని చెప్పారు: సీఎం
  • హుద్‌హుద్‌ సమయంలో నా పనితీరును ప్రధాని మెచ్చుకున్నారు: సీఎం
  • నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు: సీఎం
  • బాధల్లో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజం: సీఎం

12:44 PM, 3 Sep 2024 (IST)

వరద బాధితులకు ఎంత ఖర్చయినా చేస్తాం: సీఎం

  • సహాయ చర్యల కోసం డబ్బు గురించి ఆలోచించం: సీఎం
  • వరద బాధితులకు ఎంత ఖర్చయినా చేస్తాం: సీఎం
  • వరద బాధితుల సాయానికి ప్రజలు ముందుకు రావాలి: సీఎం
  • బాధితులకు ఎలా సాయం చేస్తారో మీరే ఆలోచించాలి: సీఎం
  • ప్రతి కుటుంబం కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి: సీఎం
  • ప్రజలు మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయమిది: సీఎం
  • ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం అందుతుంది: సీఎం
  • కష్టాల్లో రాజకీయాలు చేయడం సరికాదు: సీఎం చంద్రబాబు
  • ఐదేళ్లుగా అధికార యంత్రాంగానికి పక్షవాతం వచ్చింది: సీఎం
  • సరిగా పనిచేయకపోతే మంత్రులపైనా చర్యలకు వెనకాడను: సీఎం

12:43 PM, 3 Sep 2024 (IST)

ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు: సీఎం

  • క్షేత్రస్థాయిలో బాధితుల అవసరాలు తీరుస్తున్నాం: సీఎం
  • ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు: సీఎం
  • ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
  • హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పిస్తున్నాం: సీఎం
  • ప్రతి సచివాలయానికి ఒక అధికారిని నియమించాం: సీఎం
  • 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించాం: సీఎం
  • ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, బోట్లు వాడుతున్నాం: సీఎం
  • మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు యత్నిస్తున్నాం: సీఎం
  • డివిజన్‌కు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించాం: సీఎం
  • 32 మంది ఐఏఎస్‌లు సహాయక చర్యల్లో ఉన్నారు: సీఎం
  • పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చాం: సీఎం
  • మూడుపూటలా ఆహారం అందించాలని ఆదేశించాం: సీఎం
  • చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని చెప్పా: సీఎం
  • అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలి: సీఎం
  • అధికారులు సరిగా పనిచేయకపోతే సహించేది లేదు: సీఎం
  • ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌ సేవలు వినియోగిస్తున్నాం: సీఎం
  • వరద బాధితుల బాధలు వర్ణనాతీతం: సీఎం
  • ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి: సీఎం
  • కొన్నిచోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి: సీఎం
  • ఐవీఆర్‌ఎస్‌ సందేశాలకు ప్రజలు స్పందించాలి: సీఎం
  • వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా: సీఎం
  • సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు: సీఎం

12:41 PM, 3 Sep 2024 (IST)

మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికీ ఆహారం

  • మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికీ ఆహారం అందిస్తాం: నిమ్మల
  • ప్రకాశం బ్యారేజి చరిత్రలోనే ఇంత వరద రావటం ఇదే తొలిసారి: నిమ్మల
  • 2-3 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి: మంత్రి నిమ్మల
  • ఒక్కరోజులోనే 3 లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది: మంత్రి నిమ్మల

12:31 PM, 3 Sep 2024 (IST)

ఏపీ, తెలంగాణకు విరాళం ప్రకటించిన సినీ ప్రముఖులు

  • ఏపీ, తెలంగాణకు విరాళం ప్రకటించిన సినీ ప్రముఖులు
  • విరాళం ప్రకటించిన త్రివిక్రమ్‌, ఎస్‌.రాధాకృష్ణ, నాగవంశీ
  • రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్‌, రాధాకృష్ణ, నాగవంశీ
  • ఏపీ, తెలంగాణకు రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటన

12:31 PM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 18.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

  • ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • బ్యారేజ్‌లో గంటగంటకూ తగ్గుతూ వస్తున్న వరద ప్రవాహం
  • 11.43 లక్షల నుంచి 8.41 లక్షల క్యూసెక్కులకు చేరుకున్న వరద
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 18.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

12:19 PM, 3 Sep 2024 (IST)

ఏడుచోట్ల గండి పడింది: మంత్రి నిమ్మల

  • బుడమేరు కాల్వకు ఏడుచోట్ల గండి పడింది: మంత్రి నిమ్మల
  • ఒకవైపు 3 చోట్ల, మరోవైపు 4 చోట్ల గండి పడింది: మంత్రి నిమ్మల
  • గండ్లు పూడ్చేందుకు జలవనరుల శాఖ అహర్నిశలు కృషిచేస్తోంది: నిమ్మల
  • భవిష్యత్తులో 12 లక్షల క్యూసెక్కులొస్తే బ్యారేజ్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నార్థకంగా ఉంది: నిమ్మల
  • 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరదకు తగ్గట్లుగా భవిష్యత్‌ ప్రణాళిక: మంత్రి నిమ్మల
  • కృష్ణా కరకట్ట పటిష్టతకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి నిమ్మల
  • బుడమేరు వద్ద గండ్లు పూడ్చేందుకు 2, 3 రోజులు సమయం పడుతుంది: నిమ్మల
  • ఇరిగేషన్‌ శాఖపై జగన్‌ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం: మంత్రి నిమ్మల

12:19 PM, 3 Sep 2024 (IST)

5 లక్షల మందికి భోజనం సిద్ధం చేస్తున్న మంగళగిరి అక్షయపాత్ర

  • గుంటూరు జిల్లా: వరద బాధితుల కోసం అక్షయపాత్ర ఆహారం
  • 5 లక్షల మందికి భోజనం సిద్ధం చేస్తున్న మంగళగిరి అక్షయపాత్ర

12:18 PM, 3 Sep 2024 (IST)

సింగ్‌నగర్‌లో క్రమంగా తగ్గుతున్న నీటి ప్రవాహం

  • విజయవాడ సింగ్‌నగర్‌లో క్రమంగా తగ్గుతున్న నీటి ప్రవాహం
  • వరదలో చిక్కుకున్న వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పడవల ద్వారా ఆహారం పంపిణీ
  • హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్న సహాయ సిబ్బంది

12:18 PM, 3 Sep 2024 (IST)

ఉదయం నుంచి ఆహారం పంపిణీపై వివరాలు తెలుసుకున్న సీఎం

  • వరద సహాయచర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • ఉదయం నుంచి ఆహారం పంపిణీపై వివరాలు తెలుసుకున్న సీఎం
  • టెలీకాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుతో సమీక్ష
  • 5 హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందన్న అధికారులు
  • హెలికాప్టర్లు, పడవలు, ట్రాక్టర్ల ద్వారా అందిస్తున్నామన్న అధికారులు
  • 5 లక్షల ఆహారం ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపిన అధికారులు
  • వంద శాతం ఆహారం పంపిణీ జరగాలి: సీఎం చంద్రబాబు
  • ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా అందించాలి: సీఎం
  • క్షేత్రస్థాయిలో ఆహారం అందిందన్న వివరాలు అధికారులే నిర్ధారించుకోవాలి: సీఎం
  • బాధితుల బాధను అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలి: సీఎం
  • మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో పనిచేయాలి: సీఎం
  • నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ఏర్పాట్లు చేసుకోవాలి: సీఎం

11:54 AM, 3 Sep 2024 (IST)

వేల ఎకరాల్లో పంట నష్టం

  • పల్నాడు జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం
  • పంట చేతికి రాకముందే నష్టపోయామన్న రైతులు
  • పాటిబండ్ల గ్రామానికి నిలిచిన రాకపోకలు
  • వరద ఉద్ధృతికి నీటమునిగిన పంట పొలాలు
  • పాటిబండ్ల వాగుకు ఇంత ఉద్ధృతి ఎప్పుడూ చూడలేదన్న రైతులు

11:53 AM, 3 Sep 2024 (IST)

వరద బాధితులకు డిప్యూటీ తహసీల్దార్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శుల విరాళం

  • వరద బాధితులకు డిప్యూటీ తహసీల్దార్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శుల విరాళం
  • ఒకరోజు వేతనాన్ని ఇవ్వాలని ధర్మచంద్రారెడ్డి, విశ్వేశ్వరనాయుడు నిర్ణయం

11:52 AM, 3 Sep 2024 (IST)

కృష్ణా నదికి వరద తగ్గుముఖం పడుతోంది: మంత్రి నిమ్మల

  • కృష్ణా నదికి వరద తగ్గుముఖం పడుతోంది: మంత్రి నిమ్మల
  • సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నాం: మంత్రి నిమ్మల
  • ప్రతి ఇంటికి ఆహారం, తాగునీరు, పండ్లు పంపిణీ చేస్తున్నాం: నిమ్మల
  • ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని సీఎం చెప్పారు: నిమ్మల
  • రోడ్లపై బురద తొలగించేందుకు సిబ్బందిని రప్పిస్తున్నాం: మంత్రి నిమ్మల
  • పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నాం: మంత్రి నిమ్మల
  • వరద తగ్గుముఖం పడుతున్నందున రోడ్లపై బురద తొలగించే చర్యలు: నిమ్మల
  • ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున వరద రాలేదు: మంత్రి నిమ్మల
  • పెద్దఎత్తున విపత్తు వచ్చినా సీఎం సూచనలతో ముందుకెళ్తున్నాం: నిమ్మల
  • ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతోంది: మంత్రి నిమ్మల
  • 11 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది: మంత్రి నిమ్మల
  • బ్యారేజీ గేట్లను ఢీకొన్న పడవలను వరద తగ్గాక తొలగిస్తాం: మంత్రి నిమ్మల

11:52 AM, 3 Sep 2024 (IST)

విజయవాడ మధురానగర్‌ వద్ద కట్టకు గండి

  • విజయవాడ మధురానగర్‌ వద్ద కట్టకు గండి
  • ఏలేరు, బుడమేరు కాల్వలు కలిసేచోట కట్టకు గండి
  • రైలు వంతెన వద్దకు భారీగా చేరుతున్న వరద

11:52 AM, 3 Sep 2024 (IST)

40 వేల ఆహార పొట్లాలను విజయవాడకు పంపించిన గొట్టిపాటి

  • వరద బాధితులకు తన వంతు సాయంగా ఆహార పొట్లాలు అందిస్తున్న మంత్రి గొట్టిపాటి
  • 40 వేల ఆహార పొట్లాలను అద్దంకి నుంచి విజయవాడకు పంపించిన గొట్టిపాటి
  • బాపట్ల జిల్లాలో ముంపునకు గురైన లంక ప్రాంతాల్లో పర్యటిస్తున్న గొట్టిపాటి
  • వరద ముంపు తగ్గేవరకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతుందన్న మంత్రి గొట్టిపాటి

11:52 AM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 19 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

బ్యారేజ్‌లో గంటగంటకూ తగ్గుతూ వస్తున్న వరద ప్రవాహం

11.43 లక్షల నుంచి 8.64 లక్షల క్యూసెక్కులకు చేరుకున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల

ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 19 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు

వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

11:51 AM, 3 Sep 2024 (IST)

వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి

  • వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి
  • ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ నుంచి టెక్నీషియన్లను రప్పించిన మంత్రి గొట్టిపాటి
  • ప్రవాహం తగ్గాక యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం
  • ఎప్పటికప్పుడు శాఖాధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న గొట్టిపాటి

11:51 AM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • బ్యారేజ్‌లో గంటగంటకూ తగ్గుతూ వస్తున్న వరద ప్రవాహం
  • 11.43 లక్షల నుంచి 8.94 లక్షల క్యూసెక్కులకు చేరుకున్న వరద
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 19.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

10:56 AM, 3 Sep 2024 (IST)

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు

  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు
  • 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో 120 మంది సిబ్బంది

10:51 AM, 3 Sep 2024 (IST)

వరద సహాయచర్యల కోసం విరాళం ప్రకటించిన విశ్వక్‌సేన్‌

  • వరద సహాయచర్యల కోసం విరాళం ప్రకటించిన విశ్వక్‌సేన్‌
  • ఏపీ సీఎం సహాయనిధికి విశ్వక్‌సేన్‌ రూ.5 లక్షల విరాళం
  • తెలంగాణ సీఎం సహాయనిధికి విశ్వక్‌సేన్‌ రూ.5 లక్షల విరాళం

10:50 AM, 3 Sep 2024 (IST)

విజయవాడ భవానీపురం లలితానగర్ ప్రాంతంలో పర్యటించిన హోంమంత్రి అనిత

  • విజయవాడ భవానీపురం లలితానగర్ ప్రాంతంలో పర్యటించిన హోంమంత్రి అనిత
  • బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు స్వయంగా అందించిన మంత్రి అనిత
  • ప్రజలు ధైర్యంగా ఉండి.. వరద తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకోవాలి: హోంమంత్రి అనిత

10:50 AM, 3 Sep 2024 (IST)

దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులకు రంగం సిద్ధం

  • దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులకు రంగం సిద్ధం
  • అధికారులతో నిపుణుడు కన్నయ్యనాయుడు సమావేశం
  • దెబ్బతిన్న గేట్లు, కౌంటర్ వెయిట్ ఏర్పాటుపై సూచనలిస్తున్న కన్నయ్యనాయుడు
  • బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదు.. ఒక గేటుకు బోటు తగిలింది: కన్నయ్యనాయుడు
  • కౌంటర్‌ వెయిట్‌ బ్రేక్‌ అయింది.. కొత్త బాక్సులకు డిజైన్‌ చేశాం: కన్నయ్యనాయుడు
  • కౌంటర్‌ వెయిట్‌ లేకున్నా గేట్లు దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం: కన్నయ్యనాయుడు
  • మళ్లీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్‌ వెయిట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు: కన్నయ్యనాయుడు
  • ఒక గేటుకే సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చు: కన్నయ్యనాయుడు
  • గేట్లు అందరూ అనుకున్నంత పూర్తిగా దెబ్బతినలేదు: కన్నయ్యనాయుడు
  • గేట్లు దించకముందే ఢీకొన్న బోట్లను తీయాలని చూస్తున్నాం: కన్నయ్యనాయుడు
  • సాయంత్రంలోపు ఒక నిర్ణయం తీసుకుని బోట్లు ఎలా తీయాలో చూస్తాం: కన్నయ్యనాయుడు
  • గేట్లన్నీ బాగానే ఉన్నాయి.. కౌంటర్‌ వెయిట్‌కు ప్రత్యామ్నాయం చూస్తాం: కన్నయ్యనాయుడు
  • వారం, 15 రోజుల్లో సమస్యను పరిష్కరించవచ్చు: కన్నయ్యనాయుడు
  • ప్రకాశం బ్యారేజీకి ఇంతకుముందెన్నడూ ఇలాంటి వరద లేదు: కన్నయ్యనాయుడు

10:50 AM, 3 Sep 2024 (IST)

ఆహారంతో పాటు పండ్లు, పాలు, మెడికల్‌ కిట్లు

  • విజయవాడ కలెక్టరేట్‌కు వచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​తో కలిసి వరద సహాయచర్యల పర్యవేక్షణ
  • సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • తొలిసారిగా డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నాం: రామ్మోహన్‌నాయుడు
  • 15 ఏళ్లుగా డ్రోన్‌ టెక్నాలజీ ఉన్నా ఎవరూ వినియోగించుకోలేదు: రామ్మోహన్‌నాయుడు
  • ఆహారంతో పాటు పండ్లు, పాలు, మెడికల్‌ కిట్లు అందిస్తున్నాం: రామ్మోహన్‌నాయుడు
  • కేంద్రం నుంచి 25 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చాయి: రామ్మోహన్‌నాయుడు
  • పవర్‌ బోట్ల ద్వారా సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి: రామ్మోహన్‌నాయుడు
  • రెండు నేవీ నుంచి, 3 ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి మొత్తం 5 హెలికాప్టర్లు వచ్చాయి: రామ్మోహన్‌నాయుడు
  • అవకాశాలన్నీ ఉపయోగించుకుని సహాయచర్యలు అందిస్తున్నాం: రామ్మోహన్‌నాయుడు
  • విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో సీఎం చంద్రబాబుకు తెలుసు: రామ్మోహన్‌నాయుడు
  • చంద్రబాబుకు ఉన్న అనుభవంతో ప్రజల్లోనే ఉంటూ సూచనలిస్తున్నారు: రామ్మోహన్‌నాయుడు

10:07 AM, 3 Sep 2024 (IST)

కొట్టుకుపోయిన రోడ్డు

  • ఎన్టీఆర్ జిల్లా: వరద తాకిడికి కొట్టుకుపోయిన తోటరావులపాడు-చింతలపాడు రోడ్డు
  • రహదారి కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు

10:06 AM, 3 Sep 2024 (IST)

జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం

  • తెలుగు రాష్ట్రాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం
  • సీఎంల సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం
  • తెలుగు రాష్ట్రాల్లోని వరద బీభత్సం కలచివేసింది: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • అతిత్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • తెలుగు ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నా: జూనియర్‌ ఎన్టీఆర్‌
  • ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల విరాళం: జూనియర్‌ ఎన్టీఆర్‌

10:06 AM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 8.94 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 19.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం

9:28 AM, 3 Sep 2024 (IST)

రాష్ట్రం నలుమూలల నుంచి ఆహారం పంపుతున్న వివిధ సంస్థలు

  • వరద సహాయచర్యలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో లోకేష్ సమన్వయం
  • వరద బాధితులకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆహారం పంపుతున్న వివిధ సంస్థలు
  • 5 హెలికాప్టర్లు, 174 బోట్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీటి సరఫరా
  • ఆహారం, తాగునీటిని సరఫరా చేస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • రాష్ట్రంలో దెబ్బతిన్న 2 వేల కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 25 చోట్ల రోడ్లకు కోతలు
  • భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 1,80,244 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
  • రాష్ట్రవ్యాప్తంగా 43,417 మందిని 163 పునరావాస శిబిరాలకు తరలింపు
  • విజయవాడలో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కొనసాగుతున్న ఆహార పంపిణీ
FLOODS IN AP (ETV Bharat)

9:02 AM, 3 Sep 2024 (IST)

కొట్టుకుపోయిన లింగాల వంతెన

  • ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన లింగాల వంతెన
  • కిలోమీటర్ పొడవు ఉన్న లింగాల వంతెనపై పలుచోట్ల భారీ గండ్లు
  • వరదలో కొట్టుకుపోయిన కాంక్రీట్ శ్లాబులు, రెండుచోట్ల భారీ గోతులు
  • జగ్గయ్యపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి నిలిచిపోనున్న రాకపోకలు

8:53 AM, 3 Sep 2024 (IST)

మున్నేరులో సాధారణ స్థితికి చేరిన వరద ఉద్ధృతి

  • ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో సాధారణ స్థితికి చేరిన వరద ఉద్ధృతి
  • ఎన్టీఆర్ జిల్లా: వరద ముంపు నుంచి బయటపడిన లింగాల వంతెన
  • ఎన్టీఆర్ జిల్లా: వాగుల్లో వరద తగ్గడంతో గ్రామాలకు రాకపోకల పునరుద్ధరణ

8:51 AM, 3 Sep 2024 (IST)

జాతీయరహదారిపై యథావిధిగా రాకపోకలు

  • హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై యథావిధిగా రాకపోకలు
  • నిన్న రాత్రి నుంచి జాతీయరహదారిపై కొనసాగుతున్న రాకపోకలు
  • ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మం. ఐతవరం వద్ద తగ్గిన మున్నేరు ఉద్ధృతి
  • గరికపాడు పాత వంతెన కోతకు గురవడంతో కొత్త వంతెనపై రాకపోకలు
  • గరికపాడు వద్ద కొత్త వంతెన పైనుంచి రాత్రి నుంచి వాహనాలకు అనుమతి
  • కొత్త వంతెన పైనుంచి వన్‌వేలో వాహనాలు వదులుతున్న పోలీసులు
  • కొత్త వంతెనపై వన్‌వేలో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచన

8:51 AM, 3 Sep 2024 (IST)

వర్షాలు, వరదల వల్ల 500కు పైగా రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

  • వర్షాలు, వరదల వల్ల 500కు పైగా రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • వరదల కారణంగా మరో 160 రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
  • హావ్‌డా-బెంగళూరు, హావ్‌డా-పాండిచ్చేరి, హావ్‌డా-చెన్నై రైళ్లు రద్దు
  • శాలిమార్-త్రివేండ్రం, హాతియా-బెంగళూరు రైళ్లు రద్దు
  • ఎర్నాకులం-హాతియా, జైపూర్-కోయంబత్తూర్ రైళ్లు రద్దు
  • దిల్లీ - విశాఖ, దన్‌బాద్‌ - కోయంబత్తూర్ రైళ్లు రద్దు
  • ఇంటికన్నె-కేసముద్రం మధ్య శరవేగంగా రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు

8:51 AM, 3 Sep 2024 (IST)

పులిచింతల ప్రాజెక్టులో కూడా తగ్గిన వరద

  • పులిచింతల ప్రాజెక్టులో కూడా తగ్గిన వరద
  • ప్రస్తుతం పులిచింతల ఔట్‌ఫ్లో 4.64 లక్షల క్యూసెక్కులు

8:50 AM, 3 Sep 2024 (IST)

సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి నారాయణ

  • ఇవాళ వరద తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం: మంత్రి నారాయణ
  • సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి నారాయణ
  • వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు అందిస్తున్నాం: మంత్రి నారాయణ
  • ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం: నారాయణ

8:50 AM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 9.17 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 19.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం

8:50 AM, 3 Sep 2024 (IST)

దివిసీమలో ఇంకా కొనసాగుతున్న వరద

  • కృష్ణా జిల్లా: దివిసీమలో ఇంకా కొనసాగుతున్న వరద
  • కృష్ణా జిల్లా: తమను ఆదుకోవాలని దివిసీమ రైతుల ఆవేదన
  • కృష్ణా జిల్లా: పంట చేతికి రాకముందే నష్టపోయామన్న రైతులు
  • పూర్తిగా దెబ్బతిన్న రొయ్యలు, చేపల చెరువులు
  • కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గంలో నీటమునిగిన పొలాలు
  • అవనిగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్న 10 పునరావాస కేంద్రాలు
  • వరద పరిస్థితిని సమీక్షిస్తున్న బుద్ధప్రసాద్‌ తనయుడు వెంకట్‌రామ్‌
  • కృష్ణా జిల్లా: దివిసీమలో సుమారు పదిచోట్ల కరకట్టపై వరద ప్రవాహం
  • ఇసుక బస్తాలు వేసి కరకట్టను కాపాడుకుంటున్న అధికారులు, స్థానికులు

8:50 AM, 3 Sep 2024 (IST)

విజయవాడ-గన్నవరం జాతీయ రహదారిపైకి పలుచోట్ల వరదనీరు

  • విజయవాడ-గన్నవరం జాతీయ రహదారిపైకి పలుచోట్ల వరదనీరు
  • విజయవాడ-గన్నవరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం
  • విజయవాడ-గన్నవరం మధ్య పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల హాస్టళ్లలోకి చేరిన వరద
  • విద్యార్థులను తీసుకెళ్లాల్సిందిగా తల్లిదండ్రులకు విద్యాసంస్థల నుంచి ఫోన్లు

8:49 AM, 3 Sep 2024 (IST)

హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ

  • విజయవాడ: హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ
  • హెలికాప్టర్ల ద్వారా జారవిడిచే కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన అధికారులు
  • వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులు విడుదల
  • సింగ్‌నగర్‌, అంబాపురంలో హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్న వాయుసేన సిబ్బంది
  • వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఆహారం పంపిణీ

8:49 AM, 3 Sep 2024 (IST)

విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్దరణ

  • విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్దరణ
  • కోదాడ, సూర్యాపేట మీదుగా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ

8:49 AM, 3 Sep 2024 (IST)

అమరావతి పట్టణంలో తగ్గిన వరద ముంపు

  • పల్నాడు జిల్లా: పాత అమరావతి వద్ద కృష్ణానదిలో తగ్గిన వరద
  • పల్నాడు జిల్లా: అమరావతి పట్టణంలో తగ్గిన వరద ముంపు
  • పల్నాడు జిల్లా: పెదమద్దూరు వద్ద కూడా తగ్గిన వాగు ఉద్ధృతి
  • వరద తగ్గడంతో తేరుకున్న ముంపు ప్రాంతాల్లోని బాధితులు

8:01 AM, 3 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 9.79 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 20.5 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిన పడవలు
  • వరద తగ్గుముఖం పట్టాక పడవలను తొలగించే అవకాశం

8:01 AM, 3 Sep 2024 (IST)

విజయవాడలో క్రమంగా తగ్గుతున్న వరద

  • విజయవాడలో క్రమంగా తగ్గుతున్న వరద
  • యనమలకుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో తగ్గిన నీరు
  • విజయవాడ: నీరు తగ్గాక ఇళ్లలోకి చేరుకుంటున్న ప్రజలు
  • సింగ్‌నగర్‌లో వరద ప్రభావం తగ్గేందుకు సమయం పట్టే అవకాశం
  • వరద ముంపులోనే పాయకాపురం, కండ్రిక, వైఎస్సార్‌ కాలనీ తదితర ప్రాంతాలు
  • పునరావాస కేంద్రాలు, ఎత్తయిన ప్రాంతాల్లో సహాయచర్యలు
  • వరద బాధితులకు ఆహారం అందజేసిన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
  • వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
  • విజయవాడ: అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజల ఇబ్బందులు
  • విజయవాడ: విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం
  • విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు యథాతథం

7:19 AM, 3 Sep 2024 (IST)

ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన

  • ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన
  • అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం
  • రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బందరు వరకు రుతుపవన ద్రోణి
Last Updated : Sep 3, 2024, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details