Korean Kexim Bank Representatives met Minister Lokesh :రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు.
ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలి :మంత్రి లోకేశ్‌ను కొరియన్ కెక్సిమ్ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు.
లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ'