ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్​గా బొబ్బిలి మహిళ - BOBBILI WOMAN RARE FEAT

ఐసీబీసీ డైరెక్టర్​గా బొబ్బిలి నియోజకవర్గం బాడంగికి చెందిన కొల్లి భారతి

BOBBILI WOMAN RARE FEAT
Bobbili woman As Director of Bank of China (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 10:26 AM IST

Bobbili woman as director of China Bank: ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (ఐసీబీసీ) డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడకు చెందిన కొల్లి భారతి(43) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌ ప్రధాన కార్యాలయంలో ఆమె పనిచేస్తున్నారు. ఆమె తండ్రి కొల్లి సింహాచలం ఆర్మీ విశ్రాంత అధికారి. తల్లి లక్ష్మి గృహిణి. అతని ప్రథమ కుమార్తె భారతి చిన్నతనం నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి అనుకున్నది సాధించిందని తండ్రి సింహాచలం వెల్లడించారు.

క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent

పిల్లల గురించి తండ్రి మాటల్లో:సైన్యంలో పనిచేయడంతో నాకు తరచూ బదిలీలు అయ్యేవి. భారతి మదనపల్లెలోని జేఎన్‌టీయూసీ అనుబంధ ఎంసీబీటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. 1999లో బెంగళూరులోని హెచ్‌పీ, డెల్‌ కంపెనీల్లో పనిచేసింది. 12 ఏళ్ల క్రితం డెల్‌ సంస్థ మూడునెలల పనిపై అమెరికాకు పంపించింది. ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలోని డ్యూ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసింది. తర్వాత ఐసీబీసీకి ఎంపికైంది. న్యూయార్క్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నాలుగేళ్లుగా డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది ‘రైజింగ్‌స్టార్‌ ఉమెన్‌’లో చోటు సాధించింది. మా రెండో బిడ్డ రూప డచ్‌ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌గానూ, మూడో కుమార్తె సుష్మ యూకేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గానూ పనిచేస్తున్నారు అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'

క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent

ABOUT THE AUTHOR

...view details