ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను - జగన్‌ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన - Kodi Kathi Seenu joined tdp

Kodi Kathi Seenu Joined TDP : జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.

Kodi_Kathi _Seenu_Joined_TDP
Kodi_Kathi _Seenu_Joined_TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 10:34 PM IST

Kodi Kathi Seenu Joined TDP : జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శీను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఎస్సీ కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతు లభించినా తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని అన్నారు. తాను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలేనని అన్నారు.

టీడీపీలోకి 40 మంది వాలంటీర్లు - చంద్రబాబుపై నమ్మకంతోనే చేరామని వెల్లడి - Volunteers joined TDP in Nellore

జగన్ మాటలు నమ్మని జనం :నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గత ఐదు సంవత్సరాలుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో పలికే పలుకులను జనం నమ్మటం లేదు. అందుకే ఒక్కో వర్గం వారు వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలలో ఇప్పటికే అంతంతగా ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. గడిచిన రెండు వారాల్లో బీసీలు, మైనార్టీలు భారీగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కూటమికి బాసటగా నిలుస్తున్నా ఎస్సీ, ఎస్టీలు : ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన నాయకులు, కుటుంబాలు కూటమికి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలోని ఠాణేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను టీడీపీ పార్టీలోకి చేరారు. తన అన్న సుబ్బరాజు కుటుంబంతో పాటు గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాలు కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వారందరికిి బుచ్చిబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

"జగన్ మోహన్ రెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను చేసిన ప్రయత్నం ఫలించినా నా జీవితం మాత్రం ఐదేళ్లు కటకటాల వెనక మగ్గిపోయింది. రాష్ట్రంలో అన్ని పార్టీల వారు నాకు సంఘీభావం తెలిపారు. కానీ, నేను అభిమానించిన వైఎస్సార్సీపీ పార్టీ నుంచి మాత్రం ఏ ఒక్కరు సహకరించలేదు. ప్రస్తుతం నేను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే." - జనపల్లి శ్రీనివాస్‌, కోడికత్తి నిందితుడు

ఎన్నికల వేళ వైసీపీకి షాక్​ - టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- క్విట్‌ జగన్‌'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు

టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను - జగన్‌ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన

ABOUT THE AUTHOR

...view details