KK and Mayor Vijayalaxmi to Join Congress : కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్న తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తెలిపారు. బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌ను కలిసి పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అన్నారు.
బీఆర్ఎస్‌కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
KK QUITS BRS : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించినట్లు కేకే పేర్కొన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) తనకు చాలా గౌరవం ఇచ్చారని, తనకు కూడా ఆయనపై గౌరవం ఉందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తనకు బాగా సహకరించారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగాలన్న కుమారుడు విప్లవ్ కుమార్ నిర్ణయం మంచిదేనని కేశవరావు తెలిపారు.
కేసీఆర్‌తో సమావేశమై వచ్చిన తర్వాత కేకేతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి భేటీ అయ్యారు. అటు తాను మాత్రం ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువవుతుందని అన్నారు. నగర అభివృద్ధి, అధికారులతో పనులు త్వరగా అవుతాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే, తన వెంట కార్పొరేటర్లు ఎవరినీ తీసుకుపోవడం లేదని చెప్పారు.