How to Get Kisan Credit Card :రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వివిధ పథకాలను తీసుకొస్తూ.. వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం 1998లో రైతుల కోసం తక్కువ వడ్డీకే రుణం అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకమే.. కిసాన్ క్రెడిట్ కార్డు యోజన. మరి, ఈ కార్డును ఎలా పొందాలి? అందుకు కావాల్సిన పత్రాలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి? కలిగే ప్రయోజనాలేంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులూ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులూ ఈ సేవను అందిస్తున్నాయి. బ్యాంకుల వద్దకు వెళ్లడం ద్వారా లేదా ఆన్లైన్లో స్వయంగా అప్లై చేసుకోవడం ద్వారా కూడా కిసాన్ కార్డును పొందవచ్చు. అలాగే, భూ యజమాని నుంచి కౌలు రైతుల వరకు ఎవ్వరైనా ఈ కార్డును తీసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో కిసాన్ కార్డు ఎలా పొందవచ్చంటే?
- కిసాన్ క్రెడిట్ కార్డును పొందాలనుకునే వారు.. తమ దగ్గరలో ఖాతా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను సంప్రదించాలి.
- అప్పుడు అక్కడ KCC అప్లికేషన్ ఫారమ్ తీసుకొని అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి.
- ఐడీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్సు / పాన్ కార్డు / పాస్‌పోర్టులలో ఏదో ఒకటి ఇవ్వాలి.
- దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ అడిగే ఇతర పత్రాలను అప్లికేషన్ ఫారమ్‌కి జత చేసి బ్యాంక్‌లో సమర్పించాలి.
- అప్పుడు సంబంధిత బ్యాంకులు వివరాలన్నీ సరిచూసుకుని.. ఐదేళ్ల కాల పరిమితితో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుని(కేసీసీ) మంజూరు చేస్తుంది. కార్డును పొందిన వెంటనే వ్యక్తిగత రహస్య కోడ్‌ను అందిస్తుంది.
ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే?
- కిసాన్ కార్డు కోసం ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
- హోమ్ పేజీలో రుణాల ఆప్షన్ సెలక్ట్ చేసుకొని.. అందులో "KCC" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అక్కడి సమాచారాన్ని పూర్తిగా చదివి.. అడిగిన వివరాలన్నింటిని ఎంటర్ చేయాలి.
- అంతా పూర్తయిందనుకున్న తర్వాత.. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
- మీరు అప్లై చేసినట్టుగా ఒక రిఫరెన్స్ నంబర్ పొందుతారు. కార్డు స్టేటస్‌ను తెలుసుకునేందుకు అది ఉపయోగపడుతుంది.
కార్డుతో పొందే ప్రయోజనాలు..