తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఊర్లో ఏ ఇంటి గేటు ముందు చూసినా కొండముచ్చులే - ఎందుకో తెలుసుకోండి - BABOONS BANNERS TO PREVENT MONKEYS

కరీంనగర్‌ వాసవీ కాలనీలో కోతుల బెడద - సూపర్‌గా ప్లాన్ చేసిన కాలనీవాసులు - ఇంటి ముందుకు కోతి వస్తే పరార్‌ అయ్యేలా ప్లాన్

Karimanagar Residents Places Baboons Banners To Prevent Monkeys
Karimanagar Residents Places Baboons Banners To Prevent Monkeys (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 3:26 PM IST

Updated : Dec 24, 2024, 4:24 PM IST

Karimanagar Residents Places Baboons Banners To Prevent Monkeys :ఆ కాలనీలో కోతుల బెడద ఎక్కువ. ఎటు చూసినా వానరాలే. ఏ పనులు చేసుకోవాలన్నా, బయట నుంచి ఏమైనా తీసుకురావాలన్నా కోతులు ఎక్కడ ఎగబడతాయోనని భయం. ఇంటి బయట ఏమైనా పెడతామంటే అవి ఉంచుతాయా అని సందిగ్ధం. అసలు వాటి ఏమీ చేయలేము, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో వాళ్లంతా ప్లాన్ చేశారు. కోతులను కొట్టకూడదు, అవి ఇంట్లోకి రాకుడదు. గేటు ముందుకు వచ్చాయంటే భయపడి వెళ్లిపోవాలి. ఇలా అనుకుని ఒక పని చేశారు. అంతే ఆ కాలనీలో ఏ ఇంటి ముందుకు కోతులు రావడం లేదు. వచ్చినా భయపడి వెళ్లిపోతున్నాయి. అలా అవి రాకుండా ఏం చేశారంటే..

కరీంనగర్ జిల్లా వాసవి నగర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కాలనీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. చేతిలో ఏదైనా పట్టుకుని వెళ్తే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇంటి బయట ఏమైనా పెట్టామే అనుకోండి ఇక దాని గురించి మర్చిపోవాల్సిందే. వాటిని ఏమీ అనలేరు. కొట్టలేరు. ఇక చేసేది ఏమీ లేక పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫోన్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అనుకున్నారు.

వానరాలకు ఆత్మీయ విందు - ఉత్సాహంగా స్వీకరించిన కోతులు - Soulful feast for the monkeys HYD

ఐకమత్యంగా ప్లాన్‌ చేసి సూపర్‌ :ఇంట్లోకి రావాలంటే అవి భయపడిపోవాలి. అది కాలనీవాసుల మెయిన్‌ కాన్సెప్ట్‌. అందుకు వారు కోతులు వేటికి ఎక్కువగా భయపడతాయో ఆలోచించారు. ఇంక మైండ్‌లో ఠక్కున కొండముచ్చు వచ్చింది. అంతే కోతులు కొండముచ్చులను చూసి భయపడతాయన్న విషయం అందరికి తెలిసిందే. అంతే ఇక కొండముచ్చుల ఫొటోలను బ్యానర్లుగా చేసి ప్రతి ఇంటి గేటుకు కట్టారు. అంతే ఇక ఆ రోజు నుంచి ఆ కాలనీలో కోతులు బెడదే లేదు. ఇలా వారి సమస్యకు ఐకమత్యంగా ఆలోచించి పరిష్కరించారు. కానీ ఇప్పుడైన అధికారులు పట్టించుకుని కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ - ఎప్పుడైనా చూశారా? - Monkeys Hulchul in Suryapet

Kondamuchu Security in Vinayaka Mandapam Kesamudram : కొండెంగ పహారాలో గణనాథుని నవరాత్రి వేడుకలు

Last Updated : Dec 24, 2024, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details