ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాన గంధర్వుడి కోరిక నెరవేరేదెప్పుడో- ఎస్పీ బాలు ఇంట్లో 'వేద-నాద’ ప్రచారం ఇంకా మాటల్లోనే - BALA SUBRAMANYAM DONTED HOUSE

ఐదేళ్లు పూర్తికావస్తున్నా కదలని కంచి పీఠాధిపతి-రూ.కోటికి పైగా విలువ చేసే ఇళ్లు ఇంకేన్నాళ్లు నిరుపయోగంలోనే ఉంటుందో!

kanchi_peetham_neglects_singer_bala_subramanyam_donted_house
kanchi_peetham_neglects_singer_bala_subramanyam_donted_house (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 11:56 AM IST

Updated : Jan 5, 2025, 1:18 PM IST

Kanchi Peetham Neglects Singer Bala Subramanyam Donted House : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని తన నివాసాన్ని 2020 ఫిబ్రవరి 11న వేదపాఠశాల నిర్వహణకు కంచిపీఠానికి అప్పగించారు. కంచి పీఠం కోరిక మేరకు రూ.10 లక్షలు వెచ్చించి అవసరమైన వసతులు కల్పించారు. ఐదేళ్లు పూర్తికావస్తున్నా కంచి పీఠాధిపతి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ ‘వేద-నాద’ ప్రచారం కొనసాగిస్తామని చెప్పిన మాట ఇంకా చేతల్లోకి రాలేదు.

అదే సంవత్సరం బాలసుబ్రహ్మణ్యం కొవిడ్‌తో మృతి చెందారు. ఆయన ఉన్నతాశయంతో రూ.కోటికి పైగా విలువ చేసే ఇంటిని అందించినా వినియోగంలోకి తీసుకురావడంలో కంచి పీఠం విఫలమైంది. బాలు కుటుంబం నివసించిన నివాసంలో నేడు దీపం వెలిగించే వారే కరవయ్యారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై నెల్లూరు కంచి మఠం మేనేజర్‌ నందకిషోర్‌ మాట్లాడుతూ బాలసుబ్రమన్యం నివాసంలో వేద పాఠశాలను తొలుత పదిమంది విద్యార్థులతో ప్రారంభించినా వసతులు సక్రమంగా లేకపోవడంతో నిర్వహించలేకపోయారని ఆయన తెలిపారు. మిద్దెపైన రేకులషెడ్‌లో పిల్లలు ఉండటం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించారన్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించడం లేదన్నారు. ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచన జరుగుతోందని వివరించారు.

రామోజీకి ఎస్‌పీ బాలు పాదాభివందనం- దివికేగిన ఈ ఇద్దరు మిత్రుల స్నేహం గురించి తెలుసా? - RAMOJI BALASUBRAMANYAM FRIENDSHIP VIDEO

'ఈ గృహాన్ని ఏదైనా ఒక మంచి పనికి వాడాలనే కోరికగా ఉన్నప్పుడు కంచి పీఠాధిపతి శ్రీ జద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ వేద పాఠశాల పెట్టే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇక్కడ ఇంటిలో చిన్నచిన్న మార్పుల తరువాత వేద పాఠశాల నిర్వహన కొనసాగుతుంది. నా ఇల్లు వేద పాఠశాలగా ఉపయోగించుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.' అని నాడు తన ఇంటిని వేద పాఠశాలకు అప్పగిస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.

సంస్కృతి కేంద్రంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గృహం

Last Updated : Jan 5, 2025, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details