Kadapa SP Harshavardhan Raju on Badvel Incident :వైఎస్సార్ జిల్లా బద్వేలులో దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్ కుట్రప్రకారమే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బాలికకు ఐదుళ్లుగా విఘ్నేష్‌తో పరిచయం ఉందని, పెళ్లి చేసుకోమని అడగడం వల్లనే బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప రిమ్స్‌లో ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. బద్వేల్ పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసి, మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు.
యువతి కాలిన గాయాలతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని, యువతికి బద్వేలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ యువతి చనిపోయిందని అన్నారు. యువతికి ఐదేళ్లుగా విఘ్నేష్ అనే వ్యక్తితో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారని, ఆరు నెలల క్రితం మరో యువతిని విఘ్నేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు.
"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం