తెలంగాణ

telangana

నన్ను తీసుకొచ్చింది ఈ పోలీసే - నటి కాదంబరి అరుపులు - Kadambari Jethwani Fires on SI

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 10:41 AM IST

Jethwani Files Complaint ibrahimpatnam police station : ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో వైస్సార్సీపీ నాయకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ ఎస్సైపై మండిపడ్డారు. 'ముంబయి నుంచి నన్ను తీసుకొచ్చింది' ఇతనే అంటూ పెద్దగా అరుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

EKadambari Jethwani Fires on SI in Ibrahimpatnam Police Station
Kadambari Jethwani Fires on SI in Ibrahimpatnam Police Station (ETV Bharat)

Kadambari Jethwani Fires on SI in Ibrahimpatnam Police Station :సినీ నటి కాదంబరీ జెత్వానీ ఓ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైస్సార్సీపీ నాయకుడు విద్యాసాగర్‌తోపాటు కొందరు పోలీసు అధికారులపై ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సైపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబయి నుంచి తనను, బంధువులను అప్పట్లో దగ్గర ఉండి ఇబ్రహీంపట్నానికి తీసుకొచ్చింది ఈ అధికారే అంటూ ఆ ఎస్సైని చూపిస్తూ ఆమె పెద్దగా అరవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. జెత్యానీ ఆగ్రహంతో ఆయన వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ABOUT THE AUTHOR

...view details