Judicial Inquiry On Kaleswaram :సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుఆనకట్టలపై విచారణ కొనసాగించనుంది. కమిషన్ కు అవసరమైన సాయం అందించేందుకు వీలుగా న్యాయ, సాంకేతిక, ఆడిటింగ్ బృందాలను నియమించుకోనున్నారు. ఇద్దరు న్యాయవాదులు, ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక బృందం, ఆడిటింగ్ బృందాల నియామకం త్వరలో జరగనుంది. వారి నుంచి అవసరమైన సహాయ, సహకారాలు తీసుకుంటూ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు.
1 Month Deadline For Submission Of Affidavits :అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాధారాలను సమర్పించేందుకు ప్రజలకు మే నెలాఖరు వరకు కమిషన్ గడువిచ్చింది. ఇందుకోసం మూడు ఆనకట్టలకు విడిగా, ఉమ్మడిగా ఒకటి మొత్తం నాలుగు బాక్సులను కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేశారు. మొదటి దఫా పర్యటన ముగించుకొనిజస్టిస్ పీసీఘోష్ఇవాళ తిరిగివెళ్లారు. నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో సమావేశమైన ఆయన సంబంధిత అంశాలు, విచారణ ప్రక్రియపై చర్చించారు.
Justice PC Ghose Committee Visit :వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో జస్టిస్ ఘోష్ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఆ పర్యటనలో మేడిగడ్డ ఆనకట్టను సందర్శించడంతో పాటు హియరింగ్స్ చేపట్టనున్నారు. ఇప్పటికే కొందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులతో పాటు ఆనకట్టల పనులు చేసిన గుత్తేదార్లు, సంబంధిత వ్యక్తులను మొదటి దశలో కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు, నివేదనలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు.