తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవన్​రెడ్డిని కోల్పోయేందుకు పార్టీ సిద్దంగా లేదు - ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం' - MLC JEEVAN REDDY LIKELY TO RESIGN - MLC JEEVAN REDDY LIKELY TO RESIGN

Jeevan Reddy Planning To Resign To MLC Post : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవన్‌రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దంగా లేదని భట్చి వెల్లడించారు. జీవన్‌ రెడ్డి గౌరవానికి భంగం కలుగకుండా చూస్తామని పేర్కొన్నారు.

MLC  Jeevan Reddy
MLC Jeevan Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 12:27 PM IST

Updated : Jun 25, 2024, 3:12 PM IST

Jeevan Reddy Likely To Resign From MLC Post: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం, హస్తం గూటిలో చిచ్చు రేపింది. సంజయ్ చేరికతో జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఆయన చేరికతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు.

జీవన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. జీవన్‌ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని భట్టి విక్రమార్క అన్నారు. జీవన్‌ రెడ్డి మనస్తాపానికి గల కారణాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన చాలా కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంతరం జీవన్‌రెడ్డితో మాట్లాడుతుందని, జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దంగా లేదని ఉపముఖ్యమంత్రి అన్నారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పల్లెలన్నీ తిరుగుతానని పేర్కొన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్న ఆయన, ఇప్పటివరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండా, పార్టీలో జరగాల్సింది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​ చేరిక పట్ల జీవన్​ రెడ్డి అసహనం! - జగిత్యాలలో ఆసక్తికర పరిణామాలు

తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే సంజయ్​ను పార్టీలోకి తీసుకోవడం మనస్తాపానికి గురి చేసిందని జీవన్ రెడ్డి వాపోయారు. బేగంపేట ప్రకాష్ నగర్​లో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం అసెంబ్లీ ఛైర్మన్​కు రాజీనామా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

' నన్ను సంప్రదించకుండానే సంజయ్​ను పార్టీలోకి తీసుకోవడం మనస్తాపానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వదిలిపెట్టి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదు. ఈరోజు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇతర పార్టీలోకి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన లేదు.'-జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

జీవన్‌రెడ్డి సీనియర్‌ నేత - ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము : మంత్రి శ్రీధర్​బాబు - MLC Jeevan Reddy Plans to Resign

Last Updated : Jun 25, 2024, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details