JEE Mains Results Released : జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 మందికి వంద పర్సంటైల్ రాగా, వీరిలో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం విశేషం. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్ఫష్టం చేసింది. తెలంగాణ నుంచి రిషీ శేఖర్ శుక్లా, రోషన్ సాయి పబ్బ, ముత్తవరపు అనూప్, హందేకర్ దివిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయాసాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేశ్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌కి సంబంధించిన కీ సోమవారం విడుదల కాగా, తాజాగా ఎన్టీఏ ఫలితాలను వెల్లడించిది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగిన సెషన్- 1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల 70వేల 36మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక జేఈఈ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ఫలితాలకు ఈ లింక్‌ను (https://jeemain.nta.ac.in/) క్లిక్ చేయండి.