JEE Main 2025 Results : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం (ఫిబ్రవరి 10న) మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో రిజల్ట్‌ను విడుదల చేశారు.
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ విడుదలైన ఫలితాలలో దేశవ్యాప్తంగా బాలికల కేటరిగిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ సత్తా చాటింది. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక బాలికగా సాయి మనోజ్ఞ నిలిచింది. దేశం మొత్తంలో 14 మందికి వంద పర్సంటైల్ రాగా వారిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తి కొండ, తెలంగాణ నుంచి బని బ్రాత మాజీ 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఐదుగురికి 100 పర్సంటైల్ : రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్ సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. పరీక్షా సమయంలో అక్రమాలకు పాల్పడిన 39 మంది ఫలితాలను మాత్రం ప్రకటించలేదని ఎన్‌టీఏ పేర్కొంది. జనవరి 22 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్ మొదటి సెషన్ కి 13.11లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 12.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.