ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్రేయపురంలో ముగిసిన పడవ పోటీలు - విజేతలు ఎవరంటే ? - BOAT RACING IN ATREYAPURAM

11 జిల్లాలు - 12 జట్లు - తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన ఫైనల్ - ఫైనల్స్ లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లాల జట్లు ఉమ్మడి విజేతలుగా ఖారారు

Boat Race in Atreyapuram
Boat Race in Atreyapuram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 3:37 PM IST

Updated : Jan 13, 2025, 4:29 PM IST

Jangareddygudem and Palnadu District Teams Win in Boat Competition: కేరళ తరహాలో ఆత్రేయపురంలో నిర్వహించిన పడవ పోటీల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లాల జట్లు విజేతలుగా నిలిచాయి. రెండు జట్లకూ చెరో లక్ష చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పడవ పోటీల్లో 11 జిల్లాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి.

Boat Races And Swimming Competitions :పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరుతో డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పలు జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులతో కూడిన 11 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, కొత్తపేట, రాజోలు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దేవవరప్రసాద్, పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.

చూసేందుకు కోనసీమ నుంచిప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకూ డ్రాగన్ బోట్ రేస్ సాగింది. కాలువకు ఇరువైపులా గుమిగూడిన ప్రజలు పడవ పోటీలను చూసి కేరింతలు కొట్టారు

ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు - ఉత్సాహంగా పడవ పోటీలు

Last Updated : Jan 13, 2025, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details