VISAKHA TO CHERLAPALLI JANSADHARAN :సంక్రాంతి వేళ రైళ్లలో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే విశాఖ నుంచి చర్లపల్లికి ఓ ట్రైన్ ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఈ ట్రైన్ గురించి ముందుగా ఎటువంటి ప్రచారం చేయకపోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ ప్రత్యేక జన సాధారణ్ రైలును ఏర్పాటు చేసింది. కానీ ప్రచార లోపం కారణంగా ఈ రైలు విశాఖ స్టేషన్ నుంచి ఖాళీగా బయలుదేరింది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. ఓవైపు సంక్రాంతి పండగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం.
విశాఖ నుంచి చర్లపల్లికి ఖాళీగా ట్రైన్ - అసలు విషయం తెలిస్తే షాక్! - VISAKHA TO CHERLAPALLI JANSADHARAN
సంక్రాంతికి వచ్చి తిరుగుపయనంలో అగచాట్లు పడుతున్న ప్రయాణికులు - రైల్వే అధికారుల నిర్వాకంతో నిరుపయోగంగా మారిన రైలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2025, 12:30 PM IST
VISAKHA TO CHERLAPALLI TRAIN: సమాచారం లేని కారణంగా ఈ రైలు గురించి ప్రయాణికులకు తెలియరాలేదు. దీంతో మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండగా ఈ ట్రైన్ విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరాల్సి వచ్చింది. సామాన్య ప్రయాణికుల కోసం రిజర్వేషన్ అవసరం లేకుండా రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ట్రైన్ ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదు. సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో ఇలా జరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు - విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైలు ఎక్కలేం, బస్సును భరించలేం - ప్రైవేటు ఛార్జీ తెలిస్తే నోరెళ్లబెడుతారు!