Jagtial Love Harassment Man Murder :ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు, పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధిస్తూ ఆమెపై కత్తితో దాడికి(Attack with a knife) యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడి చివరికి వారి చేతిలోనే హతమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ దామోదర్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, తక్కళ్లపల్లికి చెందిన రాజేశం జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అతడి భార్య సత్తవ్వ, కుమార్తె(23)తో కలిసి అదే గ్రామంలోని తండ్రి నర్సయ్య వద్ద ఉంటోంది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్(26) మూడేళ్లుగా సత్తవ్వ కుమార్తె వెంటపడి పెళ్లిచేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై ఇప్పటికే మల్యాల ఠాణాలో పలుమార్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా 2022లో మహేశ్‌పై కేసు నమోదైంది.
Man Attacked Young Woman With Knife in Jagtial : నాలుగు రోజుల కిందట యువతి జగిత్యాలలోని కాలేజీకి వెళ్లే సమయంలో దాడికి యత్నించడంతో మళ్లీ ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదుచేశారు. అయినా తీరు మార్చుకోని మహేశ్ సోమవారం నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో తీవ్ర దాడికి యత్నించాడు. యువతి తాత, తల్లి అడ్డుకోవడంతో వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించే సమయంలో మహేశ్ కిందపడగా వారు పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో మృతిచెందాడు.