Jagtial Man gets 6 jobs :ఆ యువకుడిది ఓ మారుమూల ప్రాంతం. ఎదగాలనే పట్టుదలతో చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించాడు. ఇంజినీరింగ్ చేసే సమయంలో స్నేహితులను చూసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితం అయినా, లక్ష్యం మాత్రం మరవలేదు. తన పట్టుదల, ప్రణాళికలకు సోషల్ మీడియాను సక్రమంగా సద్వినియోగం చేసుకుని, 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు ఈ ఔత్సాహికుడు.
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు బెత్తపు సంజయ్. తల్లిదండ్రులు బెత్తపు లక్ష్మి-మల్లయ్య వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేద కుటుంబం కావడంతో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే చేశాడు సంజయ్. చదువుల్లో రాణిస్తూ 2019లో సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
Yong Men Gets 3 Jobs By Using Social Media : మొదట ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి, సివిల్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించాలని అనుకున్నాడు సంజయ్. కానీ తోటి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, తాను స్ఫూర్తి పొంది ముందుకు సాగాడు. జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అయితే మొదట దిశానిర్దేశం లేకుండా సాగినా, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రణాళికతో చదువుకున్నానని చెబుతున్నాడు.
ఏఈఈ ఉద్యోగంలో చేరుతా :కేవలం ఒక్కో ఉద్యోగానికి కాకుండా పలు రకాల పరీక్షలకు సిద్ధమయ్యాడు సంజయ్. అలా 2022లో రైల్వేలో గ్రూప్-డీకి ఎంపిక కాగా, టీఎస్పీఎఎస్సీ పరీక్షలు ఉండడంతో ఉద్యోగంలో చేరలేదు. 2023లో టీఎస్పీఎఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారిగా, అలాగే గ్రూపు-4 ఉద్యోగం, ఏఈఈ సివిల్, ఏఈ పోస్టులకు అర్హత సాధించాడు. ఇటీవల ఏఈ పోస్టు ర్యాంకు కార్డునూ అందుకున్నాడు. అయితే త్వరలో ఏఈఈ ఉద్యోగంలో చేరతానని అంటున్నాడు సంజయ్.
చిన్ననాటి కలను సాకారం చేసుకున్న గృహిణి - ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం - youth inspiration story