ఇళ్ల స్థలాలు కేటాయించారు - పట్టాలు మరిచారు Jagananna Colonies Beneficiaries Facing Problems: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చిన కరగ్రహరం, పెద కరగ్రహరం, తదితర గ్రామాల ప్రజలకు ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే, చిన కరగ్రహరం లబ్దిదారులు పరిస్థితి విచిత్రంగా మారింది. స్థలం కేటాయించినా ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది లబ్ధిదారుల పరిస్థితి.
ఇంటి పట్టాలు ఇవ్వడం లేదు: కృష్ణా జిల్లాలోని చిన కరగ్రహరంలో దాదాపు 80 మందికి ఇంటి స్థలం కేటాచించామని, అందు సంబందించిన స్థలం నంబర్లు ఇచ్చారు. రేపో మాపో పట్టాలు కూడా ఇస్తామని చెప్పడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు. నేతలు ఇచ్చిన హమీ గాలిలో దీపంలా మారింది. పట్టాలు ఇస్తామని చెప్పి రోజులు గడుస్తున్న లబ్దిదారులు చేతికి మాత్రం ఇంటి పట్టాలు అందడం లేదు. నెలలు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని లబ్దిదారులు వాపోతున్నారు. తమకు స్థలం చూపాలని కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
పెంచుకుంటూ పోయారా- తుంచుకుంటూ పోయారా! జగనన్న మాయాజాలం 4 లక్షల పింఛన్లు తొలగించారు
వివాదంలో ఉన్న భూమి కేటాయింపు: ప్రభుత్వం తమకు పంట పొలాలనే ఇళ్ల స్థలాలుగా మార్చి ఇచ్చిందని మరి కొంత మంది ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షనికే ప్లాట్లు మునిగిపోతాయని తెలిపారు. ఇప్పుడు ఆ స్థలాల్లోని మట్టిని కూడా తవ్వేయడం వల్ల ఆ స్థలాలు మరింత గుంతులుగా మారతాయని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలని కావాలని అడిగితే తమకు కేటాయించిన భూమి వివాదంలో ఉందని, అందుకే పట్టాలు ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారని చెప్పారు. వివాదాల్లో ఉన్న భూమిని తమకు ఇళ్ల స్థలాలుగా ఎందుకు కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. అన్ని గ్రామాలకు లాగే ఇళ్లు లేని తమకు కూడా సెంటున్న స్థలం ఇచ్చారని లబ్దిదారులు చెబుతున్నారు. అయితే మిగిలిన గ్రామాల వారికి స్థలానికి పట్టాలు ఇవ్వడంతో వారు ఇంటి నిర్మాణం పనిలో ఉన్నాయని, తమకు మాత్రం స్థలం తమకు కేటాయించినట్లు పట్టాలు ఇవ్వలేదని లబ్దిదారులు అంటున్నారు. పట్టాలు ఇవ్వాలని అడిగితే ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. తమ గ్రామంలో 80 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని, ప్రభుత్వం నుంచి పట్టాలు ఇవ్వకపోవడంతో ఎవరు కూడా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు
గోరంత సాయం, కొండంత ప్రచారం - జగనన్న వసతి దీవెన అందక విద్యార్థుల అవస్థలు
పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పేరుతో పేదల జీవితాలతో అడుకుంటుందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలం కేటాయించామని చెప్పి పట్టాలు ఇవ్వకపోవడం అన్యామన్నారు. మరోక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఇంకా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే రానున్న టీడీపీ ప్రభుత్వంలో లబ్దిదారులకు ఇంటి పట్టాలు ఇస్తామని నేతలు హమీ ఇస్తున్నారు.
మీరే పెట్టుబడి పెట్టండి, మీరే కొనుక్కోండి! -జగనన్న మార్క్ మార్ట్లు