Jagan Photos and YSRCP Colors For Govt Buildings : ఎటు చూసినా, ఎక్కడ పర్యటించినా నీలి పరదాలు సీఎం సారుకు నేస్తాలు అది విధితమే. కానీ ప్రజలకు ఎటు చూసినా వైఎస్సార్సీపీ వర్ణాలే కనిపించాలని జగనన్న చేసిన పని ఎన్నికల కోడ్ వేళ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. సొమ్ము ఒకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన భవనమైనా మన పార్టీ రంగు పెయింటే ఉండాలని బిల్డింగ్లకు నీలి రంగు కొట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా నేటికీ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వైఎస్సార్సీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ట్యాంకులు , ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న పార్టీ రంగులను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు
YSRCP Colors to Water Tank in Kakinada district :ప్రజలకు ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించకపోయినా వ్యాపార సంస్థల సహాకారంతో నిర్మించిన నీటి ట్యాంకులకు మాత్రం పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకుంటుందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఇప్పుడు ఆ రంగులు తొలగించడం గ్రామీణ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుంచి హైకోర్టు పలు మార్లు ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసి ప్రజాధనాన్ని వృథా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.