ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగార్జునసాగర్​లో కృష్ణమ్మ పరవళ్లు -​ 8 గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar Dam Gates open - NAGARJUNA SAGAR DAM GATES OPEN

Nagarjuna Sagar Gates Opened: ఎట్టకేలకు నాగార్జునసాగర్​ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండుకుండలా మారిన సాగర్ డ్యాం 8 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు.

Nagarjuna Sagar Gates Opened Today
Nagarjuna Sagar Gates Opened Today (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 12:46 PM IST

Updated : Aug 5, 2024, 1:55 PM IST

సాగర్‌ ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు (Etv Bharat)

Nagarjuna Sagar Dam Gates open:నాగార్జునసాగర్ గేట్లు ఇవాళ ఉదయం తెరుచుకున్నాయి. డ్యాంకు వరద ప్రవహాం పొటెత్తింది. దీంతో సాగర్​ ఎస్​ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్​ కుమార్​ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, 8 రేడియల్​ క్రస్ట్​ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం సైరన్​ను మోగించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు.

పోటెత్తుతున్న వరద : ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ​ప్లో 3,23,748 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 582.60 అడుగులకు చేరింది. 312.50 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఇవాళ గేట్లు ఓపెన్ చేశామని నాగార్జునసాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మొత్తం 8 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు వివరించారు. వరద నీరు ఫ్లో ఆధారంగా గేట్లు ఓపెన్ చేస్తామని ఆయన వెల్లడించారు.

శ్రీశైలం నీటి విడుదలకు గ్రీన్​ సిగ్నల్​- 4.5 టీఎంసీలు కేటాయించిన కేఆర్​ఎంబీ - KRMB meet

శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తివేత :మరోవైపు శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 3,10,840 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​కు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలానికి జూరాల, సుంకేసుల నుంచి 3.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు విడుదల: శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.7 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 63,836 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం - 10 గేట్లు ఎత్తివేత - Lifting of 10 Gates of Srisailam

నాడు కళకళ - నేడు వెలవెల - అస్తవ్యస్తంగా తారకరామ సాగర్ నిర్వహణ - No Maintenance of Tarakarama Sagar

Last Updated : Aug 5, 2024, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details