సంకల్పం ముందు ఓడిన వైకల్యం - జానపద నృత్యంలో అద్భుతంగా రాణిస్తున్న భాగ్య Interview With Bhagya Folk Dance : పుట్టుకతోనే ఒక కాలు లేకుండా పుట్టావు. నడవటమే సరిగా చేతకాని నువ్వు నాట్యం ఏం చెయ్యగలవ్ అంటూ కొందరు హేళన చేశారు. ఆ మాటలకు ఎంత మాత్రం కుంగిపోలేదు ఈ యువతి. చెదరని సంకల్పంతో నృత్యంపై పట్టు చిక్కించుకుని ఆ సవాళ్లు అన్నింటికీ తన ప్రతిభతోనే సమాధానం ఇచ్చింది. జానపద నృత్యంలో ఒక్కటే కాదు. గాయనిగా, డప్పు కళాకారిణిగా, క్రీడాకారిణిగానూ తానేంటో నిరూపించుకుంది భాగ్య. ఒంటి కాలితోనే పాటకు అవలీలగా చిందులేస్తున్న ఈ యువతి పేరు భాగ్య. తండ్రి కొమురయ్య గొర్రెల కాపరి. తల్లి కొమురమ్మ దినసరి కూలీగా పనిచేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన ఈమె ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా పట్టుబట్టి మరీ ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల విభాగంలో పీజీ పూర్తి చేసింది.
Interview With Tennis Player Myneni Saketh Sai: 12 ఏళ్లకే టెన్నిస్ చేతపట్టి.. ఏషియన్ గేమ్స్‌లో సత్తాచాటిన తెలుగుతేజం
Bhagya Folk Dancer In Mahbubnagar :అంతులేని ఆత్మస్థైర్యంతో జానపదాలకు హుషారుగా పదం కదుపుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది భాగ్య. ఈ యువతి ప్రతిభాపాటవాలకు ముగ్ధులై ఎంతోమంది వీక్షకులు నాట్యమయూరి అంటూ కొనియాడారు. ఇప్పటికే వివిధ వేదికలపై 500లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది భాగ్య. వేదికపై నృత్యం చేస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. తన నాట్య భంగిమలకు ఎంతటి వారైనా సరే ఫిదా కావాల్సిందే అన్నీ ఉండి నాట్యం చేయడం కాదు అంగవైకల్యం వెంటాడుతున్నప్పటికీ అడుగులు వేయలేని పరిస్థితిని అధిగమించి జానపద నృత్యంలో రాణిస్తూ శభాశ్ అనిపించుకుంటోంది భాగ్య. కేవలం నాట్యమే కాదు గాయనిగా, డప్పు కళాకారిణిగా, క్రీడాకారిణిగా సత్తా చాటుతూ బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.
Bhagya A Folk Dancer : మహబూబాబాద్ జిల్లాకు చెందిన భాగ్య ఓవైపు జానపద కళల విభాగంలో పీజీ పూర్తి చేసిన ఈ యువతీ జానపద నృత్యంలో (Folk Dancer) 500కి పైగా కళా ప్రదర్శనలిచ్చి ఔరా అనిపిస్తోంది. జానపద జావళీలకు హుషారుగా చిందేయడం డప్పు వాయించడం కర్రసాము చేస్తూ నృత్య ప్రదర్శనలివ్వడం భాగ్యకు సాటి మరొకరుండరమో అంటే అతిశయక్తి కాదు. అంగవైకల్యం అని వెక్కిరించిన నోళ్లను మూయించింది. అడుగులు వేయలేని పరిస్థితిని దాటి చక్కటి ప్రదర్శనలిచ్చి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది విధిరాతను సైతం ధిక్కరించి జానపద నృత్యంలో ఓ ఆణిముత్యంలా వెలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు అవమానాలను భరించి జానపద నృత్యంలో అద్భుతంగా రాణిస్తోంది. వివిధ రాష్ట్రాలలో 500కు పైగా ప్రదర్శనలిచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.
Mahbubnagar Folk Dancer Bhagya :తండ్రి కొమురయ్య గొర్ల కాపరిగా తల్లి కొమురమ్మ దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి జానపద కళలపై ఆసక్తి పెంచుకున్న భాగ్య లారెన్స్ శిష్యుడైన ప్రశాంత్ మాస్టారు దగ్గర శిక్షణ తీసుకుంది. మొదట్లో అనువైన స్టెప్పులపై మాత్రమే సాధన చేసిన భాగ్య ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. అలా దివ్యాంగులకు ఆదర్శంగా నిలిచిన స్టైల్ సినిమాకు ఆకర్షితురాలై జానపద నృత్యంలో శిక్షణ తీసుకున్నానని భాగ్య చెబుతోంది. తెలంగాణ సంస్కృతి (Telangana Culture) సంప్రదాయాలకు ప్రతికగా నిలిచిన పల్లెపదాలకు పాదం కలపడం తనకిష్టమని సంతోషంగా చెబుతున్నారు భాగ్య.
Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!
"శిక్షణ పూర్తయ్యాక మొదటిసారిగా ప్రదర్శనలిచిన్నప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. ఆ తర్వాత మరింత పట్టుదలతో ముందుకు సాగాను. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలతో ముందుకెళ్తున్న నేను పుట్టిన నాటి నుంచే కష్టాలు పడ్డాను. ఒక్క కాలితో పుట్టినందుకు ఊరంతా వింతగా చూశారు. చక్కగా ఉన్న ఆడపిల్లనే పెంచడం కష్టమని ఇలాంటి అమ్మాయిని ఎలా పెంచుతావు చంపేయమంటూ గ్రామస్థులు, బంధువులు మా తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చినప్పుడు చాలా బాధ పడ్డాను. కానీ తన తల్లిదండ్రులు మాత్రం వారి మాట వినకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను."-భాగ్య, జానపద నృత్యకారిణి.
వైకల్యాన్ని జయించి డ్యాన్సర్‌గా రాణిస్తున్న భాగ్య :ఓవైపు కుటుంబం నేపథ్యం చూస్తే తన తండ్రి గొర్రెలు కాసుకుంటూ, తల్లి రోజు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ ఇద్దరి రెక్కాడితే కానీ డొక్కాడని దీనస్థితిలో కూడా తమ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడ్డారని వారి ప్రోత్సాహంతోనే ఇంత వరకు వచ్చానని చెబుతోంది భాగ్య. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైయ్యాయని డ్యాన్స్ చేయడం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో ప్రోగ్రామ్స్ ఇవ్వలేకపోతున్నానని భాగ్యం చెపుతోంది. జానపద నృత్యంలోనే కాదు క్రీడల్లోనూ తన సత్తాను చాటుతోంది. సిట్టింగ్ వాలీబాల్‌లో అధ్బుత ప్రతిభ కనబర్చి జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్న భాగ్య తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.
భాగ్య, జానపద నృత్యకారిణి :క్రీడలకు తగిన ప్రోత్సహం అందిస్తే తనలాంటి ఎంతో మంది దివ్యాంగ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడానికి అవకాశం దొరుకుతుందని అంటోంది భాగ్య. జానపద కళల విభాగంలో పీజీ చేసిన భాగ్య సబ్జెక్టులో భాగంగా డప్పు వాయించడంతో పాటు కర్ర సామును కూడా నేర్చుకుంది. ఒకప్పుడు చదివేందుకు డ్యాన్స్ ఎందుకు అన్నోళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నారని తన గ్రామస్తులు సైతం మా ఊరు అమ్మాయని గొప్పగా చెప్పుకోవడం కొండంత బలాన్నిస్తుందని అంటోంది భాగ్య. అనునిత్యం వైకల్యం వెంటాడినప్పటికీ వందలాది ప్రదర్శనలిచ్చిన క్రమంలో ప్రేక్షకుల ఆదరణ చూసి తన కష్టాన్నంత మర్చిపోయానని చెబుతోంది. ఎల్బీ స్టేడియంలోనూ యూనివర్సిటీ వార్షికోత్సవంలో కూడా వర్శిటీ వీసీ కిషన్ రావు ప్రత్యేకంగా నృత్యం చేయించారని చెబుతోంది భాగ్య. ఆ వార్షికోత్సవంలో యూనివర్సిటీ మయూరి అని అంటూ పిలిచారని ఆ అనందాన్ని మరిచిపోలేనని ఇచ్చిందని అంటోంది.
Folk Dancer : అంతేకాదు కృత్రిమ కాలు వేయించారని కానీ అది సరిగ్గా పనిచేయలేదని చెబుతోంది భాగ్య. కాలు లేని తనలాంటివారే కష్టాలకు ఎదురీదీ బతక గల్గుతుంటే అన్నీ ఉండి అన్ని అవయవాలు సక్రమంగా ఉండీ కూడా చాలా మంది చిన్నకారణాలతో ఆత్యహత్యలకు పాల్పడడం. తనను బాధకు గురి చేస్తుందని భాగ్య చెపుతున్నారు. ఏదైనా బతికే సాధించాలని మహిళలంతా దృఢ సంకల్పంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెబుతోంది భాగ్య. ఒకప్పుడు ఊరే దాటలేని పరిస్థితుల్లోంచి పై చదువుల కోసం పట్నం దాకా పయనించింది భాగ్య. హైదరాబాద్ ప్రయాణం ఆత్మస్థైర్యం నింపిందని చెబుతోంది.
అన్నీ ఉన్నవాళ్లే బస్సులు ఎక్కడం దిగడంలో ఇబ్బందులు పడుతున్నారని నువ్వు వెళ్లి అవస్థలు పడడం అవసరమా అని ఇంట్లో వాళ్ళు మొదట్లో కన్నీరు పెట్టుకున్నారని ఆ తర్వాత తను వెళ్లాల్సిందే అని చెప్పడంతో కాదనలేకపోయారని అంటోంది భాగ్య. తన అభిమాన నేత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అని ఆయనను కలవడానికి ప్రయత్నించినా కలవలేకపోయానని భాగ్యం చెపుతోంది. ఇప్పుడైనా తన ముందు ప్రదర్శనిచ్చేందుకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని కోరుతోంది. కష్టకాలంలో తన స్నేహితులు తనకు అండగా నిలబడ్డారని వారి సహాయం ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతోంది భాగ్య. వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని సంకల్పం ముందు అది తలవంచాల్సిందేనననడానికి భాగ్యే నిలువెత్తు నిదర్శనం.
driverless tractor : ఔరా..! ఈ ట్రాక్టర్‌కు డ్రైవర్ అవసరం లేకుండానే అన్ని పనులు చేస్తోంది
తండాలో పుట్టాడు.. గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు