ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ శకటంపై ఏటికొప్పాక కీర్తి - కర్తవ్యపథ్‌ పరేడ్‌లో ప్రత్యేక ఆర్షణ - ETIKOPPAKA DOLL ARTIST INTERVIEW

కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో ప్రత్యేకంగా నిలవనున్న ఏటికొప్పాక బొమ్మలు - కళాకారుడు సంతోష్‌తో ముఖాముఖి

Etikoppaka_Doll_Artist_Interview
Etikoppaka_Doll_Artist_Interview (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 10:05 PM IST

Interview with Etikoppaka Doll Artist Santosh:అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బొమ్మలు మన రాష్ట్ర కీర్తి కిరీటంలో కలికితురాయిగా మారుతున్నాయి. కళాకారుల ప్రతిభతో, సాంప్రదాయబద్ధంగా ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారి మెరుస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అడవిలో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. గణతంత్ర దినోత్సవం వేళ కర్తవ్యపథ్​లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఈసారి ప్రత్యేకంగా నిలవనుంది. శకటంపై ప్రదర్శించనున్న బొమ్మలను తయారుచేసేందుకు సంతోష్ అనే కళాకారుడు ఎంతో శ్రమించి తయారు చేస్తున్నారు.

నేను తయారు చేసిన బొమ్మలు దేశవ్యాప్తంగా ఇంత పేరు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇంత పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి బొమ్మలు బాగా చేశావు అని మెచ్చుకుంటున్నారు. ఇది నేను ఒక్కడినే చేసింది కాదు. మా ఆర్టిజన్స్​కి అందరికి గర్వకారణం. అలానే ఈ శకటాన్ని తయారు చేయడానికి 15 రోజులు రాత్రి పగలు పట్టింది. దీన్ని రూపకల్పన చేయడానికి డిపార్ట్​మెంట్​ వారు అవగాహన కల్పించారు. వారు ఎక్కడ ఏ బొమ్మ ఉండాలి ఎంత సైజులో ఉండాలి అని చెప్పి అవగాహన కల్పించారు.- సంతోష్‌, బొమ్మల కళాకారుడు

ABOUT THE AUTHOR

...view details