Internal Roads Damage in Nizamabad :నిజామాబాద్ నగరంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నాలుగు లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్(Nizamabad Corporation) పరిధిలోని 60 డివిజన్లలోని దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. నగరం విస్తరిస్తున్నా పాత, కొత్త అన్న తేడా లేకుండా అన్ని కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సరైన రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలంలో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయాలని లేకపోతే కనీసం గుంతలైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన రహదారులను సుందరంగా మార్చిన అధికారులు కాలనీల్లోని దారులను మాత్రం విస్మరించారని విమర్శిస్తున్నారు.
People Suffering Damaged Roads in Nizamabad :విలీన గ్రామాల్లోనూ సరైన వసతులు కల్పించడంలో నగర పాలక సంస్థ విఫలమైంది. ప్రధాన, అంతర్గత దారులతోపాటు మురుగు కాలువలను (Drainage) నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో కంకర వేసి వదిలేయడంతో ఆ దారిగుండా ప్రయాణించే వారి అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో రోడ్లు లేక ప్రజలు అవస్థలు (People Suffering Damaged Roads) పడుతున్నారు.
"నిజామాబాద్లో ఎక్కడ చూసిన రోడ్లు సక్రమంగా లేవు. ఎటువైపు చూసిన గుంతల రోడ్లు, రాళ్లు తేలిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఎవ్వరిని అడగాలో తెలియడం లేదు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు వస్తారు ఓట్లు అడుగుతారు. రోడ్లు వేయండి అంటే ఎన్నికలైన తర్వాత అంటారు. అక్కడి నుంచి మరి కనిపించకుండా వెళ్లిపోతారు. వర్షం పడితే చాలు వరద నీరు ఇండ్లలోకి వస్తుంది. రోడ్లపై వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు."- స్థానికులు
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు - ఇప్పటికైనా పనులు మొదలయ్యేనా?