Intelligence Focused on Retired IAS Dhanunjay Reddy:గత ప్రభుత్వంలో సీఎంవో కేంద్రంగా చక్రం తిప్పిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో అన్నీతానై నడిపించిన ధనుంజయ్‌రెడ్డి జోలికి కూటమి సర్కార్ వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని కీలక పోస్టింగ్‌లలో ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారికి ఇప్పుడు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడంలో ధనుంజయ్‌రెడ్డి హస్తం ఉందన్న ప్రచారంతో నిఘావర్గాలు దృష్టి సారించాయి.
ధనుంజయ్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు: గతంలో జగన్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కొందరు ఐఏఎస్‌లతో ధనుంజయ్‌రెడ్డి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 6 నెలలవుతున్నా ఇప్పటికీ ఆయన హవా కొనసాగుతుండటంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సచివాలయంలో పనిచేసే కొందరు కీలక ఉద్యోగులతో ధనుంజయ్‌రెడ్డి టచ్‌లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా పనులు చక్కబెడుతున్నారని సమాచారం. పనిలో పనిగా కూటమి ప్రభుత్వ పరిణామాలపై ధనుంజయ్‌రెడ్డి కూపీ లాగుతున్నారనే అంశం కలకలం రేపుతోంది.
తన మనుషుల ద్వారా అయినవారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నట్టు చర్చ జరుగుతోంది. రుషికొండపై రాజకోట నిర్మాణం సహా వివిధ అంశాల్లో వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులకు మంచి పోస్టింగ్‌లు దక్కడంపై కొందరు ఐఏఎస్‌లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ధనుంజయ్‌రెడ్డి కనుసన్నల్లోనే మైనింగ్, భూఅక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు ధనుంజయ్‌రెడ్డే సాక్ష్యమంటూ గతంలో టీడీపీ కూడా పెద్దఎత్తున ఆరోపణలు చేసింది.
విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ - అధిక జనాభా మన ఆస్తి: సీఎం చంద్రబాబు