తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మభాషను సులభ పద్ధతిలో పిల్లలకు బోధిస్తున్న ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుడు - Innovative Telugu Teacher

Innovative Telugu Teaching Method : ఆంగ్ల మాధ్యమ జడిలో ప్రభావం కోల్పోతున్న అమ్మభాషను సులభ పద్దతిలో పిల్లలకు బోధించాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగు భాషలోని కఠినంగా ఉన్న ప్రాకృత, సంస్కృత ఒత్తుల నుంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొత్త అక్షరాలను రూపొందించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చంద్రగిరి వెంకటేశ్వర్లు.

Innovative Telugu Teaching Method
Innovative Telugu Teacher

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 10:43 PM IST

అమ్మభాషను సులభ పద్దతిలో పిల్లలకు బోధిస్తున్న ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుడు

Innovative Telugu Teaching Method : ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో అంతా ఆంగ్ల మాధ్యమం కావడం తెలుగు (Telugu) ఒక్కటే సబ్జెక్టుగా ఉండటంతో విద్యార్థులు కొంత వెనకబడుతున్నారు. నాటి ప్రాకృత, సంస్కృత ఒత్తులే ఇంకా ఉండటంతో కఠినంగా మారింది. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో భయాన్ని తొలగించడానికి ఒత్తులు లేని భాషను రూపొందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు. తనకు తెలుగు భాషపై ఉన్న మక్కువతో అమ్మ భాషను కాపాడుకోవాలని భాషో రక్షితః రక్షితః అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఎనిమిదేళ్లు కృషిచేసి ఒత్తులు లేని తెలుగు భాషను రూపొందించారు.

Bullettu bandi: డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు

Innovative Teacher In Khammam: సహచర ఉపాధ్యాయులతో చర్చించి దీనిపై కొన్ని ప్రతిపాదనలకు రూపమిచ్చారు. వీటిని అమలు చేస్తే విద్యార్థులపై ఒత్తుల ఒత్తిడి తగ్గుతుందని ప్రతిపాదనలు తయారు చేసి భాషా పండితులకు, ప్రభుత్వానికి పంపించారు. తెలుగుకు సంబంధం లేని 33 ఒత్తులు చేరాయని అంటున్నారు వెంకటేశ్వర్లు (Venkateshwarlu). ద్విత్వ, సంయుక్త, సంశ్లేష ఒత్తులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఉపాక్షరాల వలపల గిలకను సంస్కరించి హంస గీత లిపి ద్వారా అమ్మభాషను ఆవగింజంత నష్టం లేకుండా మన నుడిని కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

"బోధించే క్రమంలో పిల్లలు తెలుగును కష్టంగా నేర్చుకునే పరిస్థితి ఉంది. సరళ గుణింత పదాలు నేర్చుకున్నంత తేలికగా ఒత్తు పదాలు ఎందుకు నేర్చుకోవడం లేదని 8 సంవత్సరాలుగా పరిశోధన చేశాను. ఒత్తుల్లో ఎలాంటి శబ్దాలు లేవు. తెలుగు భాషకు ప్రథమ శత్రువులు నేటి ఒత్తు అక్షరాలు. ఒత్తులను నాలుగు స్థానాల్లో రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నమనేది ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. అందువల్ల పిల్లలు వీటిని నేర్చుకోలేక పోతున్నారు. ఆ పద్ధతిని ఏ మాత్రం మార్చి రాసేలా నాడు ఉపాక్షరాలు ఉన్నాయి. అవే నేడు ఉపాక్షారాలుగా మార్చాం. పాకృత విధానంతో నేడు రాస్తున్నాం. అవే తేట తెలుగు రాసినట్లయితే ఒత్తులు లేకుండా ఇవాళ కూడా రాయొచ్చు."-చంద్రగిరి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బస్వాపురం, ఖమ్మం జిల్లా

Bullettu bandi: బుల్లెట్టు బండి క్రేజ్... డుగ్గు డుగ్గు బండి స్కూల్ వెర్షన్ 2.O

Innovative Teacher In Khammam: ఎనిమిదేళ్ల పాటు శోధించి అచ్చులు లేని లిపిని రూపొందించారు. సహ ఉపాధ్యాయులతో పాటు భాషావేత్తలకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఈ పద్దతిని వివరిస్తున్నారు. తెలుగు సరళ బీజాక్షరాల లిపి పేరిట పుస్తకం రాశారు. మేలుకో తెలుగును ఆదుకో నినాదంతో భాషా ప్రియులకు అవగాహన కల్పిస్తున్నారు. తాను ప్రతిపాదించిన ఒత్తుల రహిత తెలుగును పరిశీలించి వినియోగంలోకి తేవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నారు. ఆయన రాసిన తేట తెలుగు పుస్తకాన్ని సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ సాహిత్య పరిషత్‌, తెలుగు భాషోపాధ్యాయుల సమావేశంలో ఏలూరి శివారెడ్డి ఆధ్వర్యంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

వినూత్న పద్ధతిలో తెలుగు బోధిస్తున్న టీచర్​ : జిల్లా విద్యాశాఖాధికారి సోమ శేఖరశర్మ, భాషా పండితులు, సాహితీ వేత్తల సమక్షంలోనూ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలించి ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలుగు పలు మార్పుల, చేర్పులకు గురైందని, భవిష్యత్తు తరాల పిల్లలకు ఇది దూరమయ్యే ప్రమాదం ఉందని తాను తేట తెలుగు ప్రతిపాదిస్తున్నట్లు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చెబుతున్నారు. తెలుగు భాషపై విద్యార్థుల్లో మక్కువ పెంచడంతో పాటు అమ్మ భాషను కాపాడేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చేస్తున్న కృషిని తోటి ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు ఉపాధ్యాయురాలి ప్రతిభ

ఆ బడిలో ఐదుగురు విద్యార్థులు - వారి కోసం ఏడుగురు పంతుళ్లు

ABOUT THE AUTHOR

...view details