ITBP Constable Driver Recruitment 2024 : టెన్త్ అర్హతతో ఏమైనా ప్రభుత్వ రంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఇది మీకోసమే. తాజాగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 545 కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులు భర్తీ చేసింది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను విడదల చేసింది. దీనికి కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ శాశ్వత విధుల్లోకి మార్చవచ్చు. అన్‌రిజర్వుడ్ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ 77, ఎస్టీ 40, ఓబీసీ 164, ఈడబ్ల్యూఎస్‌లకు 55 పోస్టులు కేటాయించారు.
ఉద్యోగానికి అర్హతలు : పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి. దానితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగ అనుభవం ఉంటే సర్టిఫికెట్‌కు జతచేయాలి.
వయసు : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు సడలింపు ఉంటుంది
దరఖాస్తు ఫీజు : అన్‌రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఇలా ఎంపిక చేస్తారు
- మొదట స్టేజ్‌లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) ఉంటుంది. రెండో దశలో రాత పరీక్ష, మూడో దశలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ప్రాక్టికల్/ స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షలు ఉంటాయి.
- మొదటి దశ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లో అభ్యర్థులు ఏడున్నర నిమిషాల్లో 1.6 కి.మీ. పరుగును పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్జంప్నకు, మూడున్నర అడుగుల హైజంప్నకు మూడు అవకాశాలు ఇస్తారు. దీంట్లో అర్హత సాధిస్తే తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)కు ఎంపిక చేస్తారు.
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)లో అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80-85 సెం.మీ ఉండాలి. ఎస్టీ అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ, ఛాతీ 76-81 సెం.మీ ఉండాలి. సరిగ్గా వయసుకు, ఎత్తుకు తగిన బరువు ఉండాలి. దీంట్లో అర్హత సాధించిన వాళ్లను తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.