తెలంగాణ

telangana

ETV Bharat / state

కేవలం రూ.5 లక్షల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి - ఈ కొలతలు పాటిస్తే చాలు! - 5 LAKHS INDIRAMMA HOUSING SCHEME

రూ.5లక్షలు సాయంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కార్యాచరణ - రాష్ట్రంలోని ఇళ్లన్ని ఒకేలా ఉండేలా ప్రభుత్వం చర్యలు

Indiramma House Construction With in 5 Lakh Rupees
Indiramma House Construction With in 5 Lakh Rupees (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 7:03 AM IST

Indiramma House Construction With in 5 Lakh Rupees :ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌ హౌస్‌ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగానే లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల సాయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడికి అందుబాటులో ఉండేలా ప్రతి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో దీనిని నిర్మించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

రూ.5లక్షలు సాయంలోనే ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేలా :ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలు కేటాయించనుంది. ఈ రూ.5లక్షలతోనే ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చనేది ప్రయోగాత్మకంగా చూపడానికే ఇందిరమ్మ నమూనా ఇళ్లను తయారు చేస్తున్నారు.

ఇందిరమ్మ నమూనా ఇల్లు (ETV Bharat)

ఈ కొలతలు పాటిస్తే :ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలని నిబంధన విధించింది. ఇందులో స్లాబ్‌ ఏరియా 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 10.5 పొడవు, 12.5 వెడల్పుతో పడక గది నిర్మించనున్నారు. 6.9 వెడల్పు, 10 చదరపు అడుగుల విస్తీర్ణంతో వంట గది, 9 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ముందు గది నిర్మాణం చేయనున్నారు. డాబా పైకి మెట్లు అనేది వారి ఇష్టం. దీంతో పాటు టాయిలెట్స్‌, సాన్నాల గది ఏర్పాటు చేయనున్నారు. ఇంటి నిర్మాణం 8 పిల్లర్లలోనే పూర్తి చేసేలా నమూనాను రూపొందించారు. సంబంధించి మ్యాప్‌ బట్టి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది.

ఇందిరమ్మ ఇళ్లన్ని ఒకేలా ఉండేలా చర్యలు :స్థలాలు ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేలా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను తొలి విడతగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నిర్మాణానికి గృహనిర్మాణశాఖ ద్వారా ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఒకేలా ఉండేలా ప్రతి మండలంలో మోడల్‌ హౌస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాదిరిగానే నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందుకోసం గృహనిర్మాణశాఖకు జిల్లాలో ఒక పీడీ, నియోజకవర్గానికి ఒక డీఈ, ఏఈలను నియమించారు. వీరి ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిర్వహించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు - అనర్హుల నుంచే భారీగా దరఖాస్తులు - అయోమయంలో అధికారులు!

'ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో నా పేరు వచ్చే వరకు టవర్ దిగను'

ABOUT THE AUTHOR

...view details