Post Office Digital Life Certificate Services :విశ్రాంత ఉద్యోగులకు తపాల శాఖ బాసటగా నిలుస్తోంది. ఖజానా కార్యాలయానికి నడిచి వెళ్లలేని వారి కోసం పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వచ్చి నేరుగా జీవన్ ప్రమాణ పత్రం (డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికేట్) అందించే సౌకర్యం కల్పిస్తోంది. తపాల ఉద్యోగికి అవసరమైన పత్రాలు చూపిస్తే అప్పటికప్పుడే ఆన్‌లైన్ నమోదు చేసి దానికి నామమాత్రంగా రూ.70 చెల్లించాలి.
ఏటా నవంబరు, డిసెంబరులో విశ్రాంత ఉద్యోగాలు తాము జీవించి ఉన్నామని ఖజానా కార్యాలయానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ క్రమంలో వారు స్వయంగా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఇంటికి దగ్గరే సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఐపీపీబీ లేద పోస్టుమ్యాన్‌ను సంప్రదించాలి. కామారెడ్డి, నిజామాబాద్‌లో రెండు ప్రధాన, 60 ఉప, 419 శాఖ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు(జీవన్ ప్రమాణ పత్రం) కాగితం రహితంగా పొందవచ్చు.
ఆ పోస్టాఫీస్‌లో మీకు అకౌంట్ ఉందా - ఉంటే ఓసారి చెక్ చేసుకోండి!