తెలంగాణ

telangana

ETV Bharat / state

కూకట్‌పల్లిలో ఐటీ అధికారుల దాడులు - రెయిన్‌బో విస్టాస్‌లో విస్తృత తనిఖీలు - IT Raid in Kukatpally Today - IT RAID IN KUKATPALLY TODAY

IT Raid in Kukatpally : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెయిన్‌ బో విస్టాస్‌లో నివసిస్తున్న బొల్లా రామకృష్ణ నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడిన కారణంగా సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Income Tax Officers Raid in Kukatpally
IT Raid in Kukatpally (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 11:39 AM IST

Income Tax Officers Raid in Kukatpally : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే కూకట్​పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 8 మంది అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కూకట్​పల్లిలోని రెయిన్ బో విస్టాస్ ఐ బ్లాక్​లోని ఫ్లాట్​లో అద్దెకుంటున్న బీఆర్​కే న్యూస్ ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

న్యూస్ ఛానల్​తో పాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బొల్లా రామకృష్ణ నిర్వహిస్తున్నారు. అదే అపార్ట్​మెంట్​​లోని ఏ బ్లాక్ 407లో నివాసముంటున్న స్టార్ పవర్ సంస్థ డైరెక్టర్ రాజేశ్​ ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్‌ ప్లాజాలోని 2,3,4 అంతస్తుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై సోదాలు చేసి పత్రాలను పరిశీలిస్తున్నారు. వ్యాపార వ్యవహారాల్లో భారీగా ఆదాయం పన్ను ఎగవేతకు పాల్పడిన కారణంగా సోదాలు జరుపుతున్నట్లు అధికారలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details