IIT Hyderabad Annual Fest 2024 : చదువుల్లోనే కాదు సరదాల్లోనూ తామెవ్వరికీ తీసిపోమంటున్నారు ఈ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు. దేశంలోని టాప్-10 ఐఐటీలలో ఒకటిగా పేరు సంపాదించిన ఐఐటీహెచ్లో 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ తరగతి గదులకే పరిమితమయ్యే విద్యార్థులు 'ఎలాన్- ఎన్ విజన్'లో(Elan And N vision) నృత్యప్రదర్శనలతో అందరినీ ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంకేతిక పోటీల్లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కళాశాల విద్యార్థులూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
Elan And N vision in IIT H :సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో(IIT Hyderabad) 'ఎలాన్- ఎన్ విజన్' పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహించారు విద్యార్థులు. నిత్యం తరగతులతో తీరిక లేకుండా గడిపే విద్యార్థులు ఏటా ఈ వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతుంటారు. ఈ వేడుకల కోసం 6 నెలల ముందే నివేదిక తయారు చేసుకుని మరీ విద్యార్థులే నిర్వహిస్తుంటారు.
బజా సే ఇండియా 2024 ఈ రేసింగ్ పోటీలు - అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విద్యార్థులు తయారుచేసినవే!
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఐఐటీ హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాంకేతిక పోటీలనూ జోష్‌గా నిర్వహించారు విద్యార్థులు. ఈ టెక్నో పోటీల్లో వివిధ కళాశాలలకుచెందిన విద్యార్థులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడెక్కడో నివసిస్తున్న పూర్వ విద్యార్థులనూ ఈ 3 రోజుల వేడుకల్లో భాగమయ్యారు. ఫోక్ డ్యాన్స్, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలను ఉత్సాహంగా ఆస్వాదించారు. విద్యార్థులు వైవిధ్యమైన రోబోలు తయారు చేసి వాటిని పోటీల్లో ఉంచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.