ICAI Appealed Against YSRCP MP Vijayasai Reddy Verdict in Court : జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయిరెడ్డికి విచారణ కోసం ఇచ్చిన నోటీసులను రద్దుచేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పుపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తెలంగాణ హైకోర్టులో అప్పీలు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించకుండా నోటీసులు రద్దుచేయడం సరికాదంది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరుకావాలంటూ గత ఏడాది అక్టోబరు 23న విజయసాయికి ICAI నోటీసులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది జులై 30న తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై ICAI అప్పీలు చేసింది.
'డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే' - శాంతి మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు - ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దుచేయాలి : సాయిరెడ్డి పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రాదన్న తమ వాదనను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదంది. విజయసాయిరెడ్డి చెన్నై కార్యాలయం నుంచి విధులు నిర్వహించారని, ICAI ఆఫీసూ అక్కడే ఉందని, అందువల్ల ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపింది. విజయసాయిపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఆయనపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంది. ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ చట్టం కింద 2007లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం విచారణ చేపడతామని చెప్పింది. ఒక సంస్థ విచారణ చేస్తుండగా 226 అధికరణ కింద హైకోర్టు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. తమ ఉత్తర్వులపై అప్పీలు చేసుకోవడానికి అప్పీలేట్ అథారిటీ ఉండగా హైకోర్టును ఆశ్రయించరాదని స్పష్టం చేసింది. సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దుచేయాలని ఐసీఏఐ కోరింది.