ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ - CS TOOK CHARGE IN AP

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విజయానంద్ - నూతన సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు

CS_took_charge_in_AP
CS_took_charge_in_AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 7:23 PM IST

Updated : Dec 31, 2024, 7:53 PM IST

IAS K. Vijayanand Taken Charge as New CS of AP:ఏపీ నూతన సీఎస్​గా 1990 బ్యాచ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్​లో ప్రత్యేక పూజల అనంతరం సీఎస్​గా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పండితుల వేదాశీర్వచనాల మధ్య విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సాయి ప్రసాద్, ఎంటీ కృష్ణబాబు, టీటీడీ ఈఓ శ్యామలరావు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉద్యోగ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్​కు ఉద్యోగులు వీడ్కోలు పలికారు.

విజయానంద్​ పూర్తి వివరాలు: తమ ఊరికి చెందిన విజయానంద్‌ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంతో వైఎస్సార్​ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామస్థులు అనందం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్‌ తల్లిదండ్రులు కావేటి నరసింహులు, తల్లి లక్ష్మీదేవి. తండ్రి పశువైద్యాధికారిగా పని చేశారు. ఆ దంపతుల ముగ్గురు కుమారుల్లో రెండోవారైన విజయానంద్‌ దువ్వూరు మండలం కానగూడురులో ప్రాథమిక విద్య, తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో 8, 9, 10 తరగతులు పూర్తి చేశారు.

అనవసర వివాదాల్లోకి లాగొద్దు - కేటీఆర్‌పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఎస్సీఎన్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్ చేసిన అనంతపురం జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ చేశారు. 1992లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేవలందించారు. విజయానంద్‌ సతీమణి జ్యోతిర్మయి గృహిణి. కుమార్తె యామినీ దివ్య అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. కుమారుడు ఉజ్వల్‌ ఎంబీబీఎస్‌ పూర్తిచేసి బెంగళూరులో ఎంఎస్‌ చేస్తున్నారు.

నా కుమారుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు అన్నివిధాలా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. పేద కుటుంబం నుంచి వచ్చిన మాకు సామాన్యుల కష్టాలు, బాధలు తెలుసు. జనరంజక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తున్నాను.- డాక్టర్‌ కావేటి నరసింహులు, విజయానంద్‌ తండ్రి

రూ.600 ఇస్తేనే పింఛన్ - మహిళా అధికారి దౌర్జన్యం - కట్​ చేస్తే

ఫేక్ ఐపీఎస్ లీలలు అన్నీఇన్నీ కావయా - పోలీసులతోనే దొంగాట

Last Updated : Dec 31, 2024, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details