తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్​ల బదిలీ - టీఎస్​పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్​ - Govt Appoints New Comissioners

IAS Naveen Nicolas Appointed As TSPSC Secretary : రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్​పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్​ను నియమించింది.

9 IAS Officers Got Transferred To Another Department in Telangana
IAS Naveen Nicolas Appointed As TSPSC Secretary

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 9:24 AM IST

IAS Naveen Nicolas Appointed As TSPSC Secretary :తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్​ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఇ.నవీన్​ నికోలస్​ను ప్రభుత్వం నియమించింది. నికోలస్‌ గతంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉండటంతో ఆయనకు ఈ స్థానంలో అవకాశం కల్పిస్తే పరీక్షలు మరింత మెరుగైన విధానంలో నిర్వహిస్తారని ప్రభుత్వం యోచిస్తోంది.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటీవలే ఐఏఎస్‌గా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి వీఎస్‌ ప్రసాద్‌ పౌర సరఫరాల సంచాలకునిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు టీఎస్​పీఎస్సీ కార్యదర్శిగా ఉన్న అనిత రామచంద్రన్​ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్​గా బదిలీ చేశారు. సమాచార శాఖ కమిషనర్ కె.అశోక్ రెడ్డిని ఉద్యానవన డైరెక్టర్​గా బదిలీ చేసింది. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్​గా ఎం.హన్మంతరావును ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు తొమ్మిది మంది ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ కమిషనర్​గా బాల మాయదేవిని ప్రభుత్వం నియమించింది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి

9 IAS Officers Got Transferred To Another Department in Telangana : ఫిషరీస్ కమిషనర్​గా ఉన్న ఐఆర్ఎస్ఎంఈ అధికారి లచ్చిరాం భూక్యాను మాతృ సంస్థకు పంపించి, మత్స్యశాఖ కమిషనర్​గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్​గా ఎ.నిర్మల కాంతి వెస్లీని నియమించిన ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ ఎండీగా కూడా ఆమెను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.సీతాలక్ష్మిని, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా జి.ఫణీంద్ర రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ జూపార్క్ డైరెక్టర్​గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి వీఎస్ఎన్వీ ప్రసాద్​ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్​గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేశారు.

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్​ తమిళి సై

ABOUT THE AUTHOR

...view details