తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనర్​ను​ ప్రేమించి పెళ్లాడిన లెక్చరర్​ - నిందితుడిపై పోక్సో​ కేసు నమోదు - lecturer married minor girl

IAS Institute Lecturer Marries Minor Girl in Hyderabad : ఉద్యోగం చేస్తున్న కాలేజీలోనే చదువుకుంటున్న మైనర్​ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఘటన శంషాబాద్​ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితునిపై కిడ్నాప్​తో పాటు పోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Lecturer Marries Minor Girl in Hyderabad
IAS Institute Lecturer Marries Minor Girl in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 5:06 PM IST

Updated : Feb 17, 2024, 10:11 PM IST

IAS Institute Lecturer Marries Minor Girl in Hyderabad : చదువు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే ఓమైనర్​ను ప్రేమ వలలో దించి పెళ్లి చేసుకున్న ఘటన శంషాబాద్​ మున్సిపాలిటీలో​ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్​ ప్రాంతానికి చెందిన సూర్యదీప్​ అనే టీచర్ శంషాబాద్​లోని ఓ ప్రైవేట్ కాలేజీ​లో చేరాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ మైనర్​పై​ కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పి, కిడ్నాప్​ చేసి నగరానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై ఆ బాలిక కుటుంబ సభ్యులు తమను ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. సూర్యదీప్​ను అదుపులోకి తీసుకుని అతనిపై కిడ్నాప్​తో పాటు పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక- కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే మృత శిశువు జననం

"బాలిక మిస్​ అయ్యిందని ప్రిన్సిపల్​ మాకు వచ్చి ఫిర్యాదు చేశారు. 14వ తేదీన మైనర్​ మిస్​ అయిందని మేము దర్యాప్తు చేశాము. సూర్యదీప్​ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా హిస్టరీ లెక్చరెర్​గా ఈ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను బాలికతో లవ్ ఎఫైర్​తో అమ్మాయిని తీసుకెళ్లి మ్యారేజీ చేసుకున్నాడు. దానికి సంబంధించి నిందితుడిని కూడా పట్టుకున్నాము. న్యాయ బద్ధంగా పోక్సో కేసు నమోదు చేశాం. అతన్ని కోర్టుకు పంపించి జైలుకి పంపించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ఏవైనా సమాచారం ఉంటే అందిస్తాము. మొదటగా కిడ్నాప్​ కేసు నమోదు అయింది. అమ్మాయి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేశాం." - బాలరాజు, సీఐ

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ఈ ఘటనను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సూర్యదీప్​ పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ముందు బైఠాయించి బాలికకు న్యాయం చేయాలని కోరారు. ఆ ఇనిస్టిట్యూట్ గుర్తింపు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు.

17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​ - పరారీలో ముగ్గురు నిందితులు

"ఇక్కడ ఉన్న ఐఏఎస్ అకాడమీలో గురువులే ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి. మేము కోరుకుంటున్నది ఒక్కటే, ఈ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి. ఇక్కడ బ్రాంచ్​ను తీసివేయాలి. కనీసం అర్హతలు లేని వారిని ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ జీతాలు ఇచ్చి వారిని లెక్చరర్లుగా పెడుతున్నారు. సూర్యదీప్​ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించి నగరానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడం నేరం. అతన్ని కఠినంగా శిక్షించాలి. బాధిత బాలికక చదువుకు అయ్యే ఖర్చువారే ఇవ్వాలి."- ప్రదీప్​, ఏబీవీపీ నాయకుడు

మైనర్​ బాలికని ప్రేమించి పెళ్లాడిన లెక్చరర్​ - నిందితుడిపై పోక్సో​ కేసు నమోదు

28 వెడ్స్​ 14- పేరెంట్స్​కు తెలియకుండా మ్యారేజ్​, పుట్టింటికి పంపించనని వింత వాదన!

Last Updated : Feb 17, 2024, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details