తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్​ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్​ రీచ్​ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి - hyderabad man escape Laos cyber den - HYDERABAD MAN ESCAPE LAOS CYBER DEN

Hyderabad man Daring Escape from Laos : భారతీయ యువకుల్ని విదేశాల్లో బంధించి సైబర్​ నేరాలు చేయిస్తున్న ముఠాల విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియా, మయన్మార్​ దేశాల్లో ఈ ముఠాల స్థావరాలు ఉన్నట్లు గతంలో బహిర్గతమయ్యాయి. తాజాగా హైదరాబాద్​ యువకుడితో పాటు పలువురిని నిర్భందించి సైబర్​ నేరాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్​ నేరాలు చేయడానికి ఒప్పుకోపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ ముఠా సభ్యుల నుంచి అతి కష్టం మీద తప్పించుకొని నగరానికి చేరుకున్న బాధితుడు తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Hyderabad man Daring Escape from Laos
Hyderabad man Daring Escape from Laos (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 1:15 PM IST

Hyderabad Man Escape Laos Cyber Den : భారత్​లో ఎక్కువ మంది యువత విదేశాలు వెళ్లి అక్కడ సంపాదించాలని కలలు కంటారు. కానీ అక్కడకు మధ్యవర్తుల ద్వారా వెళ్లి ఇష్టం లేని పనిలో చేరి నానా అవస్థలు పడుతుంటారు. ముఖ్యంగా సైబర్​ మోసాలకు వీరిని ఎంచుకొని వారితోనే ఆన్​లైన్​ మోసాలకు పాల్పడతారు. ఒకవేళ మాట వినకపోతే ప్రాణాలు పోయేంత పని చేస్తారు. అయితే తాజాగా హైదరాబాద్​ బడా బజార్​కు చెందిన రాపిడో బైక్ రైడర్ సైబర్​ వలలో చిక్కుకున్నాడు. లావోస్​ నుంచి ప్రాణాలతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్​ బడా బజార్​కు చెందిన రాపిడో బైక్ రైడర్ ఇంటికి సమీపంలో ఉండే ఫాజిల్ ఖాన్ లావోస్​లో చాట్ ప్రాసెస్ ఉద్యోగం ఉందని గత ఏప్రిల్​లో ఆశచూపాడు. ప్రారంభవేతనం నెలకు రూ.35 వేలు వస్తాయిని లావోస్ ఏజెంట్లు అబ్దుల్ సమీ, దావూద్​ను పరిచయం చేశాడు. బాధితుడి స్నేహితుడు సైతం లావోస్ వెళ్లేందుకు అంగీకరించడంతో ఇద్దరి నుంచి రూ.30వేల చొప్పున వసూలు చేశారు. మే1న ఇద్దరు సింగపూర్ మీదుగా లావోస్ రాజధాని వియంటియాన్​కు చేరుకున్నారు.

వీసా ఆన్ అరైవల్ కోసం ఒక్కొక్కరు 40 అమెరికన్ డాలర్లు చెల్లించారు. అక్కడి నుంచి రైలులో రెండు గంటల ప్రయాణం తర్వాత నాటోయ్ చేరుకున్నారు. అక్కడినుంచి మరో 8 గంటల ప్రయాణం అనంతరం గోల్డన్ ట్రయంగిల్ చేరుకున్నారు. ఇథియోపియన్ ఏజెంట్ వచ్చి వీరి నుంచి పాస్​పోర్టులను తీసుకున్నాడు. అక్కడి టాన్వెర్న్ డిస్ట్రిక్ట్ సెజ్లోని ఇంగ్ జిన్ ప్రాపర్టీ అనే కంపెనీలోకి తీసుకెళ్లారు.

హనీ ట్రాప్​, క్రిప్టోకరెన్సీ మోసాలే అధికం : అక్కడ కొన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరితో ఒప్పందంపై సంతకాలు తీసుకొని వసతి ఏర్పాటు చేశారు. మరుసటిరోజు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి కార్యాలయానికి తీసుకెళ్లి ఐడీకార్డులిచ్చారు. మరసటిరోజు నుంచి పని చేయాలని సూచించారు. హానీట్రాప్, క్రిప్టోకరెన్సీ, పెట్టుబడుల మోసాలకు సంబంధించిన వాటి కోసం మొదటి రోజు వీరికి కొత్త ఐఫోన్ ఇవ్వడంతోపాటు ఇన్​స్టాగ్రామ్​ ఐడీలు రూపొందించి ఇచ్చారు. రెండువారాల శిక్షణలో భాగంగా తమతో సైబర్ నేరాలను చేయించబోతున్నారని బాధితులు గ్రహించారు.

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

ఈక్రమంలోనే మూడు నాలుగు రోజుల తర్వాత సమీ, దావూద్ కంపెనీకి రావడంతో తమను భారత్​కు తిరిగి పంపించివేయాలని అడిగారు. ఆ మార్గం కోసం ప్రయత్నిస్తామని చెప్పిన వారివురు ఆ తర్వాత కనిపించలేదు. అమెరికా, కెనడా, యూకేల్లో ఉండే ప్రవాస భారతీయులను పెట్టుబడుల మోసాలు, హనీట్రాప్, క్రిప్టోకరెన్సీ దందాల ద్వారా మోసగించేందుకు తమను వినియోగించుకున్నట్లు బాధితులకు అర్థమైంది.

ప్రవాస భారతీయుల ఫేస్​బుక్​ హ్యాక్ : అలాంటి ప్రవాసభారతీయుల పేస్​బుక్​ ఖాతాలను హ్యాక్ చేసి వారి వివరాలను బాధిత యువకులకు అప్పగించేవారు. ఆ ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వారితో సంబంధాలు పెంచుకొని పెట్టుబడులు రాబట్టే పనిని వీరికి అప్పగించారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తే ముఠాలే సొంతంగా తయారుచేసిన యాప్​లను వినియోగించుకొని వాటిల్లోకి డబ్బులను బదిలీ చేయించుకునేలా చేయించేవారు. అలా వచ్చిన డబ్బులను ఆల్ ఆర్బిట్రేజ్ అనే ప్లాట్​ఫాం ద్వారా క్రిప్టోకరెన్సీని మార్పించేవారని పోలీసులు తెలిపారు.

విద్యుత్​ షాక్​, 15 అంతస్తుల భవనాలు ఎక్కించడం : ఈ ముఠా సభ్యుల శిక్షలకు తాళలేకి రాజస్థాన్ యువకులు పారిపోయారు. ఒకవేళ మోసాలు చేయకపోయినా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోయినా కఠినంగా శిక్షించేవారని బాధితులు పోలీసులకు వివరించారు. విద్యుత్ షాక్ సైతం ఇచ్చేవారని అలాగే 15 అంతస్తులను భవనాన్ని 7సార్లు ఎక్కించేవారు. కొన్నిసార్లు జరిమానాలు సైతం విధించేవారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్లనిచ్చేవారుకాదని చెప్పాడు. ఆ శిక్షలకు తాళలేక రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు పారిపోయి లావోస్​లోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించారు. ఈ ఘటనతో ధైర్యం తెచ్చుకున్న బాధిత యువకులు ఎంబసీకి తమ ఇబ్బందుల గురించి మెయిల్ చేశారు.

ఆధారాలు ధ్వంసం : అక్కడి లేబర్ కార్యాలయం నుంచి యువకులను పంపించివేయాలనే ఆదేశాలు రావడంతో ముఠా సభ్యులు వీరి నుంచి సిమ్ కార్టులను తీసుకొని ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు వివరించారు. బాధితుల ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేసి బయటికి ఈ ముఠా సభ్యులు పంపించారు. తొమ్మిది రోజులు బయట హోటల్లో ఉన్న బాధితులు పాస్​పోర్టులు సిద్ధమైన తర్వాత లావోస్​లోని ఓ నదిని దాటి థాయ్​లాండ్​ సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడినుంచి బస్సులో 12 గంటలు ప్రయాణం చేసి బ్యాంకాక్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడినుంచి విమానంలో గత నెల 24న హైదరాబాద్​ చేరుకున్నారు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాజిలాఖాన్, సమీ, దావూద్ తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు సమాచారం.

సైబర్ కేటుగాళ్లతో బ్యాంక్ మేనేజర్ డీలింగ్స్ - రూ.175 కోట్లు చైనాకు హవాలా - HYD SBI BRANCH 175 CRORES FRAUD

ABOUT THE AUTHOR

...view details