దివాళీ రష్ : హైదరాబాద్ - విజయవాడ హైవేపై నత్తనడకన వాహనాలు - HYDERABAD VIJAYAWADA HIGHWAY RUSH
పండుగ ముగిసిందంటే చాలు జంక్షన్ జామ్ అవ్వాల్సిందే - హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ
![దివాళీ రష్ : హైదరాబాద్ - విజయవాడ హైవేపై నత్తనడకన వాహనాలు Heavy Traffic in Hyderabad-Vijayawada National Highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2024/1200-675-22820019-thumbnail-16x9-traffic-jam.jpg)
Published : Nov 3, 2024, 8:00 PM IST
|Updated : Nov 3, 2024, 8:14 PM IST
Huge Traffic in Hyderabad-Vijayawada National Highway :హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులతో కార్ల రద్దీ నెలకొంది. దీపావళి పండుగను సొంత ఊరిలో నిర్వహించుకుని తిరిగి నగరానికి వస్తుండడంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ, ఖమ్మం, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తునట్లు తెలుస్తుంది.