Hyderabad Vegan Festival 2024 : ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాఖాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వేగాన్‌ను ప్రజలకు పరిచయం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వేగాన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేగాన్ ఫుడ్ ఫెస్టివల్స్ పేరుతో స్టాల్స్‌ను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సీపీఆర్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ సెంటర్ వేగాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
"రెండో ఏడాది ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వేగాన్స్ అనేవి జంతువులు, ప్రకృతి వల్ల వస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రకృతికే కాకుండా మనుషులకు కూడా మంచి జరుగుతుందని చాలా రీసెర్చ్‌లు నిరూపించాయి. ప్రపంచంలో ఎంతో మంది ఈ లైఫ్ స్టైల్‌ను లీడ్ చేస్తున్నారు. చాలా మంది ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఆనందంగా ఉంటున్నారు. మొక్కలు తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది."- శ్రీదేవి, న్యూట్రిషనిస్ట్ కార్యక్రమ నిర్వాహకురాలు
వేగాన్ ఒక ఆరోగ్య రహస్యం : వేగాన్ అనేది ఒక ఆరోగ్య రహస్యమని, ఇది ప్రకృతిలోని ప్రతి జీవితో సంబంధం కలిగి ఉంటుందని సినీ నటి అక్కినేని అమల అన్నారు. తాను 18 ఏళ్లుగా వేగాన్ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత కాలంలో వేగాన్స్ సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. వేగాన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానమని, ప్రతి ఒక్కరూ దానిని పాటిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారమవుతామని ఐటీ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ప్రకృతి సిద్ధంగా ఆహారం, వస్తువులు తయారు చేసే వారికి కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.