తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. 99కే తిన్నంత బిర్యానీ - అటు విక్రయదారులు, ఇటు వినియోగదారులు ఇద్దరూ ఖుష్​! - Hyderabad Unlimited Biryani Rs 99

Hyderabad Unlimited Biryani at Rs 99 Cost : హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ఆ మాట వినగానే అందిరికీ నోరూరుతుందంటే అతిశయోక్తి కాదు. సీజన్ ఏదైనా దీని హవా ఏమాత్రం తగ్గదు. అదేస్థాయిలో నగరంలో వాడవాడలా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. ఇది కాస్త ఖరీదైన భోజనమే. పండగలు, ప్రత్యేక వేడుక రోజుల్లో బంధు మిత్రులు కలిసి దీన్ని ఆరగిస్తారు. రోజూ తినాలంటే జేబుకు చిల్లే మరి, అయితే 99 రూపాయలకే చికెన్ లేదా మటన్ బిర్యానీ అంటే అందరూ ఆశ‌్చర్యపోతారు. అందులోనూ అన్ లిమిటెడ్ అంటే ఆసక్తిగా చూస్తారు. అవును మీరు విన్నది నిజమే, ఇక్కడ 100 రూపాయల్లోనే కడుపునిండా బిర్యానీ పెడుతున్నారు. ఇంతకీ ఆ వివరాలేంటో మనమూ చూద్దామా!

Hyderabad Biryani Crazy Offer
Rs 99 Special Biryani in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 7:42 AM IST

Hyderabad Unlimited Biryani at Rs 99 Cost :వేడుక ఏదైనా హైదరాబాద్ వాసుల విందులో బిర్యానీ ఉండాల్సిందే. ఎన్ని వంటకాలు వచ్చినా బిర్యానీకి నాటికీ, నేటికీ ఆదరణ తగ్గలేదు. అయితే రెస్టారెంట్​కు వెళ్లి తినాలంటే రూ. 200 నుంచి 300 ఖర్చు చేయాల్సి ఉంటుంది. చదువుకోవటానికై నగరానికి వచ్చిన విద్యార్థులు, రోజువారి కూలీలు ఇంత డబ్బు ఖర్చు చేసి తినాలంటే కష్టమే.

హైదరాబాద్ బిర్యానీ అంటే గట్లనే ఉంటది మరి - ఏడాదికి కోటికి పైగా ఆర్డర్లతో దేశంలోనే ఫస్ట్​ ప్లేస్

Rs 99 Biryani Centres in Hyderabad :వీరిని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయలకు బిర్యానీ పేరుతో ఆఫర్లు పెట్టి మరీ ప్రజలను ఆకర్షిస్తున్నారు. సికింద్రాబాద్, అమీర్​పేట్, దిల్​సుఖ్ నగర్ ప్రాంతాల్లో అధికంగా ఈ బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ ఆత్మీయ వంటకంగా పేరుగాంచిన బిర్యానీని అందరికీ అందించాలనే లక్ష్యంతోనే సరసమైన ధరలకే(Reasonable Price) బిర్యానీని విక్రయిస్తున్నామని విక్రయదారులు అంటున్నారు.

చికెన్, మటన్ ఏదైనా 99 రూపాయలకే అదీ తిన్నవారికి తిన్నంత(Unlimited Biryani Offer) పెడుతున్నారు. దీంతో జనం ఎగబడి తింటున్నారు. గిరాకీ ఎక్కువ ఉండటంతో ఒక్కో ప్లేటుపై లాభం తక్కువైనా రోజంతా అమ్మితే కాస్త గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఏ ఉద్యోగం రాని వారికి ఇదొక జీవనోపాధి మార్గంగా మారింది.

"నేను ఆరు నెలలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. చాలా చోట్ల అన్​లిమిటెడ్​ బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మార్కెట్​లో పోటీ ఉంటుంది. కానీ మనం వండే రుచి, క్వాలిటీ మీదే కస్టమర్ల రాక ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు మన ఫుడ్​తో సంతృప్తి చెందితే, ఆటోమేటిక్​గా మళ్లీ మళ్లీ వస్తారు. అందువల్లే నేను క్లిక్​ అవ్వగలిగాను."-అంకమరావు, విక్రయదారుడు

Hyderabad Biryani Crazy Offer Advantages : పేద ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని చిరువ్యాపారులు వారిని ఆకర్షించడానికి సరసమైన ధరలకే బిర్యానీని విక్రయిస్తున్నారు. ఫుట్​పాత్​లపై చిన్న బండిలు ఏర్పాటు చేయడం వల్ల అద్దె, విద్యుత్, ఏసీ లాంటి ఖర్చులతో పాటు ఫర్నిచర్ ఏర్పాటు అవసరం లేదు. అందువల్లే ఈ ధరకు విక్రయిస్తున్నామంటున్నారు. వెజ్, చికెన్, మటన్(Mutton Biryani) ఏదైనా 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ. ఓసారి తిన్నవారు మళ్లీ వస్తున్నారు. అదే వారికి పెద్ద ప్రచారం. సోషల్ మీడియా ద్వారా ఉచిత ప్రచారం పొందుతున్నారు విక్రయదారులు.

వీడియోలు చూసి వచ్చిన వారు కొందరైతే, ఇరుగుపొరుగు వారు చెబితే వచ్చి తినేవాళ్లు మరికొంతమంది. మధ్యాహ్న సమయాల్లో బిర్యానీ పాయింట్ల(Biryani Point) వద్ద ప్రజలు కిక్కిరిసి పోతున్నారు. తక్కువ ధర అయినప్పటికీ రుచి, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదంటున్నారు. తక్కువ ధర, నాణ్యమైన ఆహారం ఉందంటే చాలు వంద కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి కూడా తింటున్నారు. ఈ విధంగా తక్కువ ధరకు విక్రయిస్తూ మంచి వ్యాపారం చేస్తున్నారు. దీంతో అటు విక్రయదారులు, ఇటు వినియోగదారులు ఇద్దరూ ఖుష్​ అవుతున్నారు.

బిర్యానీ గురించి 'గొడవ'.. సారీ చెప్పించిన సత్య నాదెళ్ల

బిర్యానీ తింటుండగా ఉంగరం - అవాక్కైన కస్టమర్లు - Ring in Biryani At Peddapalli

ABOUT THE AUTHOR

...view details