Dating Scam in Hyderabad: నేటి తరం యువత 24 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ అంటూ అనేక సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు డేటింగ్ యాప్‌లు కూడా వినియోగిస్తున్నారు. ఇలాంటి డేటింగ్ యాప్‌ల వలలో పడి ఎంతో మంది యువకులు సైబర్ దాడులకు గురవుతున్నారు. ఈ కేటుగాళ్ల మాయలో పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కోల్పోతున్నారు.
ఇలాంటి తరహా డేటింగ్ యాప్‌తో హైదరాబాద్‌లో మరో నయా మోసం తెరపైకి వచ్చింది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న యువత ఇప్పుడు ఈ డేటింగ్ యాప్‌లకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అందమైన అమ్మాయిలు పబ్ యజమాన్యంతో కలిసి ఒక దందాను నడుపుతున్నారు. ఇప్పుడు ఆ డేటింగ్ స్కామ్ హైదరాబాద్ నగరంలో బయటపడింది.
New Rules for Social Media in India 2023 : 'ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్ చేయొద్దు'.. భద్రతా బలగాలకు వార్నింగ్
విశ్వసనీయ సమాచారం ప్రకారం : టింబర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లో అందమైన అమ్మాయిలు యువకులకు వలపు వల విసురుతున్నారు. పరిచయం ఏర్పరుచుకొని వెంటనే నంబర్లు మార్చుకుంటున్నారు. కలుద్దామని వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నారు. అమ్మాయే ఇన్వైట్ చేయడంతో యువకులు వెంటనే కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కడ కలుద్దామని అడిగితే మెట్రో స్టేషన్ వద్దకు రమ్మని చెబుతున్నారు. ఇలా మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లిన యువకులకు అక్కడ పక్కనే ఉన్న పబ్‌లోకి అమ్మాయి తీసుకెళ్తోంది.
ఖరీదైన మద్యం, ఆహారం ఆర్డర్ ఇచ్చి జంప్ : ఇలా లోపలికి వెళ్లిన తర్వాత యువకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు కావాలని అడుగుతున్నారు. వారి మాటను కాదనలేని యువకులు వాటి తెచ్చి ఇస్తున్నారు. ఇలా గంటలో రూ.40 వేల వరకు బిల్ చేయిస్తున్నారు. వెంటనే వాష్ రూంకో, కాస్త సైడ్‌కు వెళతానని చెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నారు. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా ఫలితం ఉండదు. విషయం అర్థమయ్యేలోపే బిల్ కట్టాలని పబ్ యాజమాన్యం యువకులపై ఒత్తిడి తెస్తోంది.
ఈ డేటింగ్ యాప్ పబ్ స్కాంలో కొసమెరుపు ఏంటంటే పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త బయట పడటంతో తాము కూడా అలాంటి బాధితులమే అంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది బాధితులు బయటకు వచ్చారు. అయితే ఈ స్కామ్‌పై ఇప్పటివరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
'కిలేడీ' వలపు వల.. 'మిస్టర్ రాజస్థాన్' విలవిల!