Ind vs Pak 2025 : ఐసీసీ టోర్నీ అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ అందరి కళ్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసమే. క్రికెట్ ప్రపంచమంతా దృష్టిసారించే ఆ పోరు మళ్లీ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇవాళ ఈ రెండు జట్లూ అమీతుమీ అంటూ బరిలోకి దిగాయి. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిదే. ఇది ఓడితే టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్లే.
90వ దశకం తర్వాత మళ్లీ ఇంత కాలానికి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ ఆనందమంతా ఆవిరైపోతుంది. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో రిజ్వాన్ బృందం ఉంది. కానీ పాక్‌కు రోహిత్‌సేన అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచి పాకిస్థాన్‌ను ఇంటికి పంపించి, తాము సెమీస్ చేరాలని భారత జట్టు భావిస్తోంది. తన మొదటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే.

జై షాతో లోకేశ్ సమావేశం : ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహించారు. దుబాయ్ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దర్శకుడు సుకుమార్, సానా సతీష్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. తనయుడు దేవాన్ష్‌తో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు లోకేశ్ ఐసీసీ ఛైర్మన్ జై షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
Had the pleasure of meeting @JayShah Ji during the #INDvsPAK match at the #ICCChampionsTrophy. Our conversation focused on upgrading cricket infrastructure in Andhra Pradesh, a topic dear to both of us. pic.twitter.com/fXn0ZjoJnj
— Lokesh Nara (@naralokesh) February 23, 2025
ICC Champions Trophy 2025 : మరోవైపు క్రికెట్ పోరు మేనియా మహా కుంభమేళాను తాకింది. దాయాది పాక్‌పై భారత విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు కొందరు కుంభమేళాలో హారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన అభిమానాలు కొందరు త్రివేణి సంగమంలో పుణస్నానం తర్వాత టీమిండియా విజయం సాధించాలని కోరుతూ గంగా మాతకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్ల పోస్టర్లను ప్రదర్శించారు.
బిహార్ రాజధాని పట్నాలో భారత క్రికెట్ జట్టు క్రీడాకారుల ఫోటోలు పట్టుకొని హోమం నిర్వహించారు. దాయాది పాక్‌పై భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మహరాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఓ హనుమాన్ గుడిలో అభిమానులు ప్రత్యేక పూజలు జరిపారు. జాతీయ జెండాలు, టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు ప్రదర్శించారు. వారణాసిలో చిన్నారులు టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా ఆల్ ది బెస్ట్ ఇండియా అంటూ బుజ్జి క్రికెట్ ఫ్యాన్స్ హుషారుగా విష్ చేశారు. హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు భారత ఆర్మీ జవాన్లు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కుంభ్‌మేళాలో గంగా హారతి, ప్రత్యేక పూజలు- చిన్నారుల స్పెషల్ విషెస్- భారత్ x పాక్ మ్యాచ్ ఫీవర్
టీమ్‌ఇండియా ఖాతాలో చెత్త రికార్డు- ఆ విషయంలో నెదర్లాండ్స్‌ను దాటేసింది