Hyderabad Police Arrested Drug Seller Nigerian At Panjagutta : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నేరగాడిని టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందా కొనసాగిస్తున్నాడు. కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలను రవాణ చేసి తీసుకువస్తున్నాడు. గోవా నుంచి వాటిని హైదరాబాద్‌కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇతన్ని టీన్యాబ్ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద పట్టుకోవడంతో మాదకద్రవ్యాల బండారం బయటపడింది.
వస్త్ర వ్యాపారం నుంచి డ్రగ్ సప్లయర్‌గా మారి : స్టాన్లీ 2009లో బిజినెస్ వీసాపై భారత దేశానికి వచ్చాడు. ప్రారంభంలో వస్త్ర వ్యాపారం నిర్వహించాడు. కొవిడ్ సమయంలో అధికంగా నష్టాలు వచ్చాయి. అతని పాస్‌పోర్టు కాలం చెల్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించడానికి కొంతమంది మాదకద్రవ్యాలు విక్రయించే ఇతర నైజీరియన్లతో స్టాన్లీ చేతులు కలిపాడు. వారికి మత్తు పదార్థాలు విక్రయించడంలో సహాయపడ్డాడు. క్రమంగా ఇతర నైజీరియన్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో స్టాన్లీ ఈ దందాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా మత్తుపదార్థాలు రప్పించి విక్రయాలు జరుపుతున్నాడు.
రూ.కోటి 20 లక్షల విలువైన నకిలీ మద్యం ధ్వంసం
దేశవ్యాప్తంగా ఏకంగా 500 మంది స్టాన్లీ వద్ద మత్తు పదార్ధాలు కొనుగోలు చేస్తున్నారంటే అతను ఏ స్థాయిలో మత్తు దందా కొనసాగిస్తున్నాడో అర్ధం అవుతోంది. మాదకద్రవ్యాలు కొనుగోలు చేసే వారిలో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరందరి వివరాలు పోలీసులు రాబడుతున్నారు. వారిని కూడా విచారించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.