ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌ మెట్రో ఆఫర్లు పొడిగింపు - అక్డోబర్ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్ ఫీజు - Hyderabad Metro Offers - HYDERABAD METRO OFFERS

Hyderabad Metro Offers : హైదరాబాద్​ మెట్రో ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఆఫర్లు పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. అదే విధంగా అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

Hyderabad Metro Offers
Hyderabad Metro Offers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 5:53 PM IST

Updated : Sep 30, 2024, 7:35 PM IST

Hyderabad Metro Offers Extended : హైదరాబాద్​ మెట్రో రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఆఫర్లను పొడిగిస్తున్నట్లు ఎల్​ అండ్​ టీ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్​ సేవర్​-59, స్టూడెంట్​ పాస్​, సూపర్​ సేవర్​ ఆఫ్​ పీక్​ అవర్​ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్​ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్​ స్టూడెంట్​ పాస్​ ఆఫర్​ కొనసాగుతుందన్నారు.

అలాగే రద్దీ లేని సమయాల్లో స్మార్ట్​ కార్డులపై 10 శాతం తగ్గింపుతో ప్రయాణించే పీక్​ ఆఫర్​ కూడా పొడిగిస్తున్నట్లు ఎల్​ అండ్​ టీ ప్రకటించింది. ఈ పొడిగింపు మెట్రో ప్రయాణికుల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. అక్టోబరు 6 నుంచి నాగోలు, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో నామ మాత్రపు చెల్లింపులతో పార్కింగ్​ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసం నామ మాత్రం రుసుము వసూలు చేస్తున్నట్లు కేవీబీ రెడ్డి వెల్లడించారు.

అక్టోబరు నుంచి నాగోలు, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో పార్కింగ్​ ఫీజు​ : సూపర్ సేవర్, స్టూడెంట్ పాస్​ల విషయంలో గుడ్​ న్యూస్ చెప్పిన మెట్రో పార్కింగ్ ఫీజు విషయంలో షాకిచ్చింది. వచ్చేనెల నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్​ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు నెలలో నాగోల్​, మియాపూర్​ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్​ ఫీజు వసూళ్లపై వాహనదారులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వారి నిరసనల నేపథ్యంలో ఎల్​అండ్​టీ మెట్రో సంస్థ కూడా వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో పెయిడ్​ పార్కింగ్​ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ అక్టోబరు నుంచి నాగోలు, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో నామ మాత్రపు చెల్లింపులతో పార్కింగ్​ ఫీజు వసూలు చేయనున్నామని ఇవాళ మెట్రో ఎండీ తెలిపారు. మరి ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Hyderabad Metro Phase 2 DPRS : హైదరాబాద్​ మెట్రో రైలు రెండో దశ మొత్తం 116.2 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.32,237 కోట్లను అంచనా వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్​ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నారు. అలాగే శంషాబాద్​ ఎయిర్​పోర్టు ప్రాంతంలో అండర్​ గ్రౌండ్​ నుంచి సొరంగ మార్గంలో మెట్రో లైన్​ వెళ్లనుంది.

కొత్త సిటీలోకి మెట్రో పరుగులు- రెండో దశ డీపీఆర్‌కు తుదిమెరుగులు - HYDERABAD METRO PHASE 2 DPR

Last Updated : Sep 30, 2024, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details