Huge Donations To CMRF Andhra Pradesh :సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసిన రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు.
సీఎంఆర్ఎఫ్కు విరాలాలు ఇచ్చిన వారి వివరాలు
- కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు
- జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ. 5 కోట్లు
- శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ. 2 కోట్లు
- విట్ ఛాన్స్లర్ డా.విశ్వనాథమ్ రూ. కోటి 57 లక్షల 50 వేలు
- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయలు
- రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు(సుజలాన్ & యాక్సిస్ ఎనర్జీ) కోటి రూపాయలు
- సీఎం రాజేష్, సీఎం రిత్విక్కోటి రూపాయలు
- కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు రూ. 50 లక్షలు
- పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ. 50 లక్షలు
- టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు
- కోటం సంధ్య రూ. 5 లక్షలు
- సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ. 5 లక్షలు
- వై.చలపతి రావు రూ. లక్ష
- పరుచూరి శ్రీనివాసరావు రూ. లక్ష
- సీహెచ్ దీపిక రూ. లక్ష
- ఏ.శోభారాణి రూ. 50 వేలు
- స్వాతంత్య్ర సమరయోధులు-సర్వోదయ ట్రస్ట్ తరపున డా.మోహన్ కృష్ణ రూ. 1.50 లక్షలు
- బొప్ప అనురాధ రూ. లక్ష
- బి.అనురాధ రూ. లక్ష
- పరుచూరి అజయ్ కుమార్రూ. 10 వేలు
- సంధ్యారాణి రూ. 10 వేలు
- కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కె.వి.రావు - రూ.5 కోట్లు
- ఏఎంగ్రీన్-గ్రీన్‌కో సంస్థ - రూ.5 కోట్లు
- ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు - రూ.కోటిన్నర
- ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ - రూ.కోటి
- మోహిత్ మినరల్స్ సంస్థ - రూ.50 లక్షలు
- కల్యాణ్ ఆక్వా అధినేత రాజేంద్రబాబు - రూ.10 లక్షలు
- శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య - రూ.10 లక్షలు
- కోటపాటి జనార్దన్‌రావు - రూ.10 లక్షలు