ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు మేమున్నాం అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations To AP Flood Victims - DONATIONS TO AP FLOOD VICTIMS

Donations to AP CMRF : రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సచివాలయంలోనే మంత్రి లోకేశ్​ను కలిసిన పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Donations To AP Flood Victims
Donations To AP Flood Victims (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 8:40 PM IST

Donations To AP Flood Victims :ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. వాగులు, ప్రాజెక్టులు, నదులు పొంగి వరద ప్రభావానికి లక్షలాది మంది సర్వస్వం కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి చెల్లాచెదురైన బాధితులకి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వారిని ఆదుకునేందుకు మానవతా దృక్పథంలో పలువురు ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే విరాళాలు అందిస్తూ మీకోసం మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నారు. తాజాగా పలువురు దాతలు మంత్రి నారా లోకేశ్​ను సచివాలయంలో కలిసి చెక్కులను అందించారు. డిక్షన్ గ్రూప్ రూ.1 కోటి, నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్​రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్​మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షల చొప్పున విరాళం అందజేశారు.

లోకేశ్​కు అందజేసిన దాతలు :ఎమ్మెల్సీ రాంగోపాల్​రెడ్డి ఆధ్వర్యంలో కర్నూల్​కు చెందిన డాక్టర్.కేవీ సుబ్బారెడ్డి రూ.11 లక్షలు, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు ఇచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలోఆల్ఫా ఇన్​స్టిట్యూట్ రూ.5 లక్షలతో పాటు రైతులు ,కార్యకర్తలు కలిసి మరో రూ.5 లక్షలు, రక్ష హాస్పిటల్స్​ నాగరాజు రూ.5 లక్షలను విరాళాలుగా అందజేశారు.

Floods Donors in AP :మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీకృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు, చదలవాడ చంద్రశేఖర్ రూ.3 లక్షలు , జర్నలిస్టు జాఫర్ రూ.1 లక్ష అందించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి, కొండేపి ప్రజలు, రైతుల తరపున రూ.6.80 లక్షలు, భీమవరపు శ్రీకాంత్​ రూ.2 లక్షలు, ఆశాబాల రూ.1.8 లక్షలు, వి.జ్యోతి రూ.1 లక్ష చొప్పున లోకేశ్​కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF

వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP

ABOUT THE AUTHOR

...view details