తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం సమక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - తల్లులకు ముందస్తు మొక్కులు - Sammakka Sarakka Jatara 2024

Huge Devotees Rush at Sammakka Sarakka Jatara : మేడారం సమక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వన దేవతల సమక్క, సారలమ్మను దర్శించుకోవడానికి రోజురోజుకు భక్తులు పోటెత్తున్నారు. ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షకుపైగా భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sammakka Sarakka Jatara 2024
మేడారం సమక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తలు - తల్లులకు ముందస్తు మొక్కులు

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 7:14 PM IST

Huge Devotees Rush at Sammakka Sarakka Jatara :మేడారం సమక్క సారలమ్మ ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా కొన్నిరోజులు ఉన్నా కూడా భక్తుల ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. సమక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రపదేశ్​, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

మేడారం వనదేవతలకు మొక్కుల చెల్లించుకునేందుకు పిల్లాపాపలతో సైతం కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. తమ సొంత వాహనాలే కాకుండా అద్దె బస్సులో, ఆర్టీసీ బస్సులో వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని ఆలయ పరిసరాల్లో నిద్రిస్తున్నారు. ఉదయాన్నే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారికి తలనీలాలు సమర్పించుకొని, పువ్వులు, పండ్లు, పసుపు కుంకుమ, వడి బియ్యం, నూతన వస్త్రాలు పట్టుకొని నిలువెత్తు బంగారం (బెల్లం) ఎత్తుకొని సమ్మక్క సారలమ్మ గద్దెల సన్నిధికి చేరుకుంటున్నారు.

Sammakka Sarakka Jatara 2024 : అమ్మల దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంతమంతా జనసంద్రంగా మారుతున్నాయి. భక్తులు క్యూలైన్​లో వెళ్తు గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆది, బుధ, గురు వారాల్లో 10 వేలకు పైగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ కూడా భక్తుల సంఖ్య లక్షకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి మేడారంలో భక్తుల సందడి నెలకొంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సైతం సమక్క, సారలమ్మను దర్శించుకుని, అమ్మవారి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ నేపథ్యంలో మేడారంలో పర్యటించి, జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

RTC Buses For Medaram Jatara : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ బస్సులను పెంచే ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరక జరిగే సమక్మ, సారలమ్మ జాతరకు అన్నీ ఏర్పాట్లను ముందస్తుగా చేపడుతోంది. ఆర్టీసీ బస్టాండ్​లోనూ ప్రయాణికులకు కనీస సౌకర్యాలను ఏర్పాట్లు చేయనుంది. వీటితో పాటు ట్రాఫిక్​ను క్లియర్​ చేయడానికి, ప్రయాణికులకు సహకరించడానికి ఆర్టీసీకి సంబంధించిన వివిధ శాఖల అధికారులను అందుబాటులో ఉంచనున్నారు. మేడారంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.

మేడారం సమక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - తల్లులకు ముందస్తు మొక్కులు

మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి

మేడారం జాతరకు రెండువేల ఆర్టీసీ బస్సులు : మంత్రి సీతక్క

ABOUT THE AUTHOR

...view details