Cash Found in 7 Boxes 7 crore in Overturned Tata Ace Vehicle :తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న 7కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. బోల్తాపడిన టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదు గుర్తించారు. కెమికల్ పౌడర్ బస్తాల మధ్య నగదు తరలిస్తున్నారు. ఈ వాహనం హైదరాబాద్ నుంచి ద్వారపూడి వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో వ్యాను డ్రైవర్ వీరభద్రరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బుల కట్టలు- ఏకంగా ఏడు కోట్లు! - 7 Boxes 7 crore Found in Vehicle - 7 BOXES 7 CRORE FOUND IN VEHICLE
Cash Found in 7 Boxes 7 crore in Overturned Tata Ace Vehicle : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న 7కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 9:23 AM IST
|Updated : May 11, 2024, 11:41 AM IST
బాక్సుల్లో డబ్బులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నగదును వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు తీసుకెళ్లారు. వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి నగదును లెక్కించారు. 7 అట్టపెట్టెల్లో మొత్తం 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నాచారం రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనె మిల్లుకు నగదు తరలిస్తున్నారని చెప్పారు. నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించామన్నారు.