How to Remove Hypothecation from RC in Telangana:ప్రస్తుతం నిత్యావసరాల వస్తువులలో బైక్, కారు కూడా చేరిపోయాయి. అందుకే చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. లోన్ సహాయంతో వెహికల్స్ కొనేవారే ఎక్కువ. అయితే.. చాలా మంది లోన్ తీర్చిన తర్వాత దాని గురించి మర్చిపోతారు. అప్పు తీర్చేశాం అనే భావనలో ఉండిపోతారు. కానీ ఇది సరికాదు. లోన్ తీర్చేసిన తరువాత కూడా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయని, ముఖ్యంగా హైపొథికేషన్ తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు హైపొథికేషన్ అంటే ఏమిటి?, దాన్ని ఎలా తొలగించాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
హైపోథికేషన్ అంటే ఏమిటి:మీరు కారు లేదా బైక్ ఫైనాన్స్ మీద కొన్నప్పుడు, సంబంధిత రుణం ఇచ్చిన బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ పేరు మీద 'రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్' (ఆర్‌సీ) ఉంటుంది. దీన్నే హైపొథికేషన్ అంటారు. అంటే, చట్టపరంగా మీ బండికి యజమాని ఆ బ్యాంకు అన్నమాట. కాబట్టి మీరు లోన్ తీర్చేసిన తరువాత హైపొథికేషన్ తొలగించి ఆర్సీని మీ పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది.
హైపొథికేషన్ తొలగింపు కోసం అవసరమైన పత్రాలు:
- బ్యాంక్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)
- ఫైనాన్షియర్, యజమాని సంతకం, స్టాంపుతో ఫారం 35 (2 కాపీలు)
- ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్
- యజమాని ID ప్రూఫ్ (ఆధార్, పాన్, ఓటర్ ID)
- యజమాని డ్రైవింగ్ లైసెన్స్
- యజమాని అడ్రస్ ఫ్రూప్
హైపోథికేషన్ తొలగింపు కోసం స్లాట్ బుకింగ్ ఎలా:
- ముందుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. https://transport.telangana.gov.in/
- హోమ్‌పేజీలో Online Services and Payments ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ కాలమ్‌లో Hypothecation/ Hire Purchase/ Lease Termination ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద కనిపించే Hypothecation/ Hire Purchase/ Lease Termination బాక్స్‌లో టిక్ చేసి మీ దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉందో లేదా Yes or No బాక్స్‌లో టిక్ చేసి Ok ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే బాక్స్‌లో బండి నెంబర్, చాసిస్ నెంబర్లోని లాస్ట్5 డిజిట్స్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి Request for OTP ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓటీపీ, క్యాప్చా ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్ మీద మీ వెహికల్ వివరాలు కనిపిస్తాయి.
- ఆ వివరాలు వెరిఫై చేసుకుని Continue ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తేదీ, నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- ఆ వివరాలు అన్నీ సరిచూసుకుని Save ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్లాట్స్ కనిపిస్తాయి.
- అప్పుడు మీకు అనుకూలమైన స్లాట్‌ను సెలెక్ట్ చేసుకుని Book ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత స్లాట్ బుకింగ్ కోసం పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తైన తర్వాత మీకు స్లాట్ బుక్ అయినట్లు వివరాలు కనిపిస్తాయి.